War 2 V/s Coolie: రజనీకాంత్తో ఎన్టీఆర్ బాక్సాఫీస్ వార్..కూలీని ఢీ కొట్టగలడా?
భారతీయ సినిమా పరిశ్రమలో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు సిద్దమవుతున్నాయి. సౌత్ ఇండస్ట్రీ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ, నార్త్ ఇండస్ట్రీ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన వార్ 2 చిత్రాల మధ్య భీకరమైన పోటీ ఉండేటట్లు కనిపిస్తున్నది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాల బిజినెస్ భారీగానే జరుగుతున్నది. ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఈ సినిమాల మధ్య పోటీ ఎలా ఉంది? తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్ పోటీ ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే..
వరుసగా సినిమాలు డిజాస్టర్లుగా మారడం, సక్సెస్ రేటు దారుణంగా పడిపోవడం బాలీవుడ్ను వెంటాడుతున్నది. ఈ క్రమంలో వార్ సినిమాకు సీక్వెల్గా రూపొందిన ఈ సినిమాను క్రేజీగా నిర్మించారు. ఈ చిత్రానికి ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. యష్ రాజ్ ఫిల్మ్ ఈ సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నారు. హృతిక్, ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నది.

అయితే ఈ సినిమాను సౌత్లోనే కాకుండా తెలుగులో కూడా యష్ రాజ్ ఫిల్మ్స్ సొంతంగా రిలీజ్ చేస్తున్నది. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ కోసం తెలుగు నిర్మాతలు భారీగా ప్రయత్నాలు చేశారు. నాగవంశీ, దిల్ రాజు, మైత్రీ మూవీస్ లాంటి వారు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం పోటీపడ్డారు. అయితే ఈ సినిమా హక్కులను ఎవరికీ ఇవ్వకుండా యష్ రాజ్ బ్యానర్ సొంతంగా రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇక వార్ 2 సినిమాకు భారీ పోటీగా నిలిచిన సౌత్ ఇండస్ట్రీ సినిమా కూలీ. ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున అక్కినేని, అమీర్ ఖాన్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. దక్షిణాదిలో ఈ చిత్రానికి ఆకాశాన్ని టచ్ చేసేంత క్రేజ్ కనిపిస్తున్నది. ఇంకా ఈ సినిమా రిలీజ్కు 50 రోజులు ఉండగానే.. బిజినెస్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తున్నది. ఈ సినిమా ఓవర్సీస్, తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోయినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా, కూలీ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ కోసం తెలుగు నిర్మాతల మధ్య భారీ యుద్ధమే జరిగింది. ఈ సినిమాకు ముందు రజనీ చిత్రాలు ఆంధ్రా, నైజాం బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్లుగా నిలిచాయి. అయినా ఈ కూలీ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను ఏషియన్ సునీల్, సురేష్ భారీ ధరకు అంటే సుమారుగా 54 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాలకు విపరీతమైన క్రేజ్ కనిపిస్తున్నది. అయితే రజనీకాంత్ మేనియా ఎక్కువగా ఉండటంతో వార్ చిత్రంతో ఎన్టీఆర్ ఎలా డీల్ చేస్తాడనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ రెండు సినిమాలకు హిట్ టాక్ వస్తే.. 100 కోట్ల కొల్లగొట్టేందుకు సిద్దమవుతున్నాయి. అయితే ఈ ఇద్దరు హీరోల బాక్సాఫీస్ రేసులో ఎవరు గెలుస్తారనేది కొద్ది రోజులు ఆగి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











