For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బన్ని 'జులాయి' బిజినెస్ పరిస్ధితి ఏంటి?

  By Srikanya
  |

  హైదరాబాద్: అల్లు అర్జున్, ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకన్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఈ నెల 9 న విడుదల 1200 ప్రింట్లతో బారీగా విడుదల అవుతోంది. ఇక ఈ చిత్రం నిర్మాత విడుదలకు ముందే మంచి రేటుకు అమ్ముకుని లాభాల్లో పడ్డారని ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది. ఏపి ధియోటరకల్ రైట్స్ ని దాసరి నారాయణరావు కి చెందిన సిరి మీడియాకు ఇరవై మూడు కోట్లుకు అమ్మారు. అలాగే శాటిలైట్ రైట్స్ ను ఐదు కోట్ల డబ్బై ఐదు లక్షలకు ఇవ్వంటతో మంచి ఖుషీగా ఉన్నట్లు చెప్తున్నారు. పెట్టిన పెట్టుబడి ని దాటే నిర్మాతకు లాభం వచ్చిందని చెప్తున్నారు. ఇంకా కేరళ,తమిళనాడు, కర్ణాటక, ఓవర్ సీస్ రైట్స్,ఆడియో,డివిడి రైట్స్ వంటివి బోనస్ గా చెప్తున్నారు.

  ''జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ మా 'జులాయి' కథ తిరుగుతుంది. వినోదం, యాక్షన్‌ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. త్రివిక్రమ్‌ శైలి సంభాషణలు, అర్జున్‌ నృత్యాలు అలరిస్తాయని''అన్నారు నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ. అలాగే...జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్‌ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందో తెరపైనే చూడాలి అన్నారు.

  అలాగే కథానుగుణంగానే కాక, పాత్రోచితంగా కూడా ఈ చిత్రానికి 'జులాయి' పేరే సరైనది అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయించారు. ఇందులో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ప్రేక్షకుల్లోకి బుల్లెట్స్‌లా దూసుకుపోతాయని, అవి అల్లు అర్జున్ నోట ఆటంబాంబుల్లా పేలతాయని సమర్పకుడు డీవీవీ దానయ్య చెబుతున్నారు. ''అర్జున్‌ శైలి నటన, నృత్యాలు ప్రధాన ఆకర్షణ. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా ఓ సెట్‌ని నిర్మించి తీసిన సీన్స్ బాగా వచ్చాయి. త్రివిక్రమ్ టేకింగ్, బన్నీ ఎనర్జీ, ఇలియానా అందం, రాజేంద్రప్రసాద్ అభినయం, దేవిశ్రీ సంగీతం మా 'జులాయి' చిత్రానికి హైలైట్‌గా నిలువనున్నాయి''అన్నారు .

  ఎప్పటికప్పుడు నటుడిగా కొత్తదనం చూపించాల్సిందే. పాత్రల ఎంపికపరంగానూ జాగ్రత్తలు తీసుకొంటున్నాను. అందులో భాగంగానే సిక్స్‌ ప్యాక్‌ చేశాను. కేశాలంకరణలు మార్చాను. ఏం చేసినా... నా అభిమానుల్ని అలరించేలా అంశాలు ఉండేలా చూసుకొంటాను అన్నారు అల్లు అర్జున్‌. సోనూసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రావు రమేష్, బ్రహ్మాజీ, తులసి, హేమ, ప్రగతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రవీందర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, నిర్మాణం: హారిక అండ్ హాసిని క్రియేషన్స్.

  English summary
  Julai producers are planning to release this film in more than 1200 theaters in Andhra Pradesh, Kerala, Tamilnadu, Karnataka and Overseas. Dasari Narayana Rao's distribution firm, Siri Media, bought the film's AP theatrical rights for a whopping price of 23 Crores. Maa TV bought satellite rights for Rs 5.75 Crores. That means the producer is already smiling happily even before the release.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X