40 కోట్ల క్లబ్‌లో ‘జులాయి’(2 వీక్స్ కలెక్షన్స్)
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-ఇలియానా జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన 'జులాయి' చిత్రం విజయవంతంగా 2 వారాలు పూర్తి చేసుకుంది. రెండు వారాల్లో ఈచిత్రం భారీగా వసూళ్లు సాధించి రూ. 40 కోట్ల క్లబ్బులో చేరింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై డివివి దానయ్య సమర్పణలో ఎన్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ బ్యాంకు దోపిడీ సంఘటన చుట్టూ సాగే ఈ చిత్రంలో బన్నీ అద్భుతంగా నటించడంతో పాటు యాక్షన్ సీన్లు ఇరగదీశాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్లస్సయింది. జులాయి మలయాళ వెర్షన్ 'గజ పోకిరి' ఈనెల ఓనం పండుగ సందర్భంగా 18న విడుదల చేసారు.
కలెక్షన్స్ డీటేల్స్
నైజా - 9.55 కోట్లు
సీడెడ్ - 5.45 కోట్లు
కృష్ణ - 1.66 కోట్లు
నెల్లూరు - 1.22 కోట్లు
గుంటూరు - 2.55 కోట్లు
వైజాగ్ - 3.10 కోట్లు
ఈస్ట్ - 1.86 కోట్లు
వెస్ట్ - 1.70 కోట్లు
టోటల్ ఏపీ : 27.09 కోట్లు (షేర్)
కర్నాటక - 3.40 కోట్లు
రెస్టాఫ్ ఇండియా - 1.60 కోట్లు
ఓవర్సీస్ - 5.00 కోట్లు
టోటల్: 37.09 కోట్లు (షేర్)
మలయాళ వెర్షన్ 'గజపోకిరి' కలుపుకుని ఈచిత్రం రూ. 40 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయింది.


Click it and Unblock the Notifications











