Junior Total Collections Worldwide: జూనియర్ టోటల్ కలెక్షన్స్.. గాలి కిరీటీ రెడ్డి మూవీకి లాభమెంత? నష్టమెంత?

వారాహి చలన చిత్రం, సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రజనీ కొర్రపాటి ఈ జూనియర్ చిత్రాన్ని నిర్మించారు. గాలి కిరీటీ రెడ్డి, శ్రీలీల, జెనీలియా దేశ్‌ముఖ్ కీలకపాత్రలు పోషించారు. రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహించగా.. జూలై 18న ప్రపంచవ్యాప్తంగా జూనియర్ మూవీ విడుదలైంది. జూనియర్ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమాకు లాభమెంత? నష్టమెంత? అనే వివరాల్లోకి వెళితే..

మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటీ రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ కావడంతో జూనియర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత సీనియర్ హీరోయిన్ జెనీలియా నటించడం, శ్రీలీల వయ్యారి సాంగ్, ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా జూనియర్ మూవీకి భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కన్నడ సీనియర్ హీరో డాక్టర్ రవిచంద్రన్, రావు రమేష్, సత్య, వైవా హర్ష, అచ్యుత్ కుమార్, సుధారాణి తదితరులు జూనియర్‌లో కీలకపాత్రలు పోషించారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించగా.. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

Junior Box Office Total Collections Worldwide How much loss or profit for Gali Kireeti Reddy s Movie

జూనియర్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార ఖర్చులు కలిపి ఈ చిత్రానికి 25 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. విడుదలకు ముందు మంచి హైప్ క్రియేట్ కావడంతో జూనియర్ మూవీకి దాదాపు రూ.10 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ పండితులు పేర్కొన్నారు. జూనియర్ మూవీ లాభాల్లోకి రావాలంటే రూ.11 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాలని ట్రేడ్ అనలిస్టులు వాల్యూ కట్టారు. ప్రపంచవ్యాప్తంగా జూనియర్ మూవీ 1100 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు నిర్మాతలు.

జూనియర్ కలెక్షన్స్
జూనియర్ వసూళ్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.20 కోట్ల ఓపెనింగ్స్‌తో కిరీటీ రెడ్డి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచాడు. రెండో రోజు రూ.1.8 కోట్లు, 3వ రోజు 2.2 కోట్లు, 4వ రోజు రూ.90 లక్షలు, 5వ రోజు రూ.70 లక్షలు, ఆరో రోజున రూ.55 లక్షలు, 7వ రోజున రూ.45 లక్షల చొప్పున ఇండియా వైడ్ నికరంగా 8.4 కోట్ల రూపాయలు.. 9.33 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది.

జూనియర్ మూవీకి తెలుగు రాష్ట్రాల నుంచే మేజర్ షేర్ వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఆంధ్రా, నైజాంలలో ఈ సినిమాకు 7 రోజుల వరకు 6.53 కోట్ల రూపాయలు వచ్చాయి. కిరిటీ, శ్రీలీలల సొంత రాష్ట్రం కర్ణాటక నుంచి కేవలం 1.51 కోట్ల రూపాయలు వసూలైనట్లుగా సాక్‌నిల్క్ తెలిపింది. ఓవర్సీస్‌లో తొలి రెండు రోజులు దుమ్మురేపగా తర్వాత ఈ చిత్రం డల్ అయ్యింది. నార్త్ అమెరికా, యూకే తదితర దేశాల్లో జూనియర్ మూవీకి రూ.60 లక్షల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి.మొత్తంగా 7 రోజుల వరకు ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకుని జూనియర్ మూవీకి వరల్డ్ వైడ్‌‌గా 10 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

జూనియర్ మూవీకి లాభమెంత? నష్టమెంత?
ఫస్ట్ వీకెండ్‌లో జూనియర్ మూవీ బాగానే హోల్డ్ చేసినప్పటికీ వర్కింగ్ డేస్‌ మొదలు కావడంతో భారీగా కలెక్షన్స్ కోల్పోయినట్లు విశ్లేషకులు తెలిపారు. అయితే డెబ్యూ సినిమాతోనే మంచి వసూళ్లు రాబట్టడం కిరీటీ రెడ్డికి ప్లస్ పాయింట్‌గా చెబుతున్నారు. 10 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్‌కు గాను ఏ ఏరియాలోనూ జూనియర్ మూవీ గట్టెక్కలేకపోయింది. 30 శాతం రికవరీతో 7 రోజుల వరకు కేవలం 4.35 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ మాత్రమే రాబట్టిన జూనియర్ మూవీ ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 6 కోట్ల రూపాయలను మిగిల్చింది.

నిర్మాత రజనీ కొర్రపాటి దాదాపు 25 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌‌ను ఈ సినిమాకు కేటాయించారు. కానీ జూనియర్ బాక్సాఫీస్ రిజల్ట్‌తో బడ్జెట్ పరంగా ఆమెకు దాదాపు 20 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగినట్లే. కాకపోతే థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా నిర్మాత ఒడ్డునపడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X