Junior Box Office Day 1: జూనియర్ బాక్సాఫీస్ కలెక్షన్స్ .. గాలి కిరీటీ రెడ్డి మూవీకి ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?

కర్ణాటక మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటీ రెడ్డి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలియగానే సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలు షాక్‌కు గురయ్యాయి. వేల కోట్ల సంపదకు వారసుడైన కిరీటీ రెడ్డి తండ్రి బాటలో వ్యాపారం కాకుండా సినిమాల వైపు రావడం ఆశ్చర్యం కలిగించింది. కిరీటీ హీరోగా పరిచయమైన చిత్రం జూనియర్. శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. వారాహి చలన చిత్ర, సాయి కొర్రపాటి ప్రొడక్షన్ బ్యానర్‌పై రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ జూనియర్ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ నేపథ్యంలో జూనియర్ చిత్రం తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది? ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాలు పరిశీలిస్తే..

12 ఏళ్ల తర్వాత జెనీలియా రీఎంట్రీ
జూనియర్ సినిమాలో కన్నడ సీనియర్ నటుడు డాక్టర్ రవిచంద్రన్ కీలకపాత్ర పోషించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత హీరోయిన్ జెనీలియా ఈ సినిమా ద్వారా తిరిగి టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. రావు రమేష్, సత్య, వైవా హర్ష, అచ్యుత్ కుమార్, సుధారాణి తదితరులు జూనియర్‌లో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహించగా.. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన కేకే సెంథిల్ కుమార్ .. డీవోపీ బాధ్యతలు చేపట్టారు.

Junior Day 1 Expected Box Office Collections Worldwide Gali Kireeti Reddy s debut Film gets Good reception

జూనియర్ బడ్జెట్ ఎంత?
అత్యంత సహజమైన లోకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకుంది జూనియర్ చిత్రం. మీడియం రేంజ్ సినిమాయే అయినా నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా జూనియర్‌ సినిమాను తెరకెక్కించారు. బెంగళూరు, హైదరాబాద్‌లలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార ఖర్చులు కలిపి ఈ చిత్రానికి 35 కోట్ల రూపాయల బడ్జెట్‌ అయినట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

జూనియర్ బిజినెస్& బ్రేక్ ఈవెన్ టార్గెట్
గాలి జనార్థన్ రెడ్డి కుమారుడి సినిమా కావడంతో పాటు శ్రీలీలతో కలిసి కిరీటీ చేసిన వయ్యారి సాంగ్‌కు మాస్ నుంచి ఊహించని రెస్పాన్స్ నేపథ్యంలో జూనియర్ మూవీకి బాగానే ప్రీ రిలీజ్ బిజినెస్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. గాలి కిరీటీ రెడ్డి సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.16 కోట్ల షేర్ రావాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. తెలుగు రాష్ట్రాల్లో 500 స్క్రీన్లు, ఇండియా వైడ్ 400 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్లు కలిపి ప్రపంచవ్యాప్తంగా జూనియర్ మూవీ 1100 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

జూనియర్ తొలి రోజు వసూళ్లు
మార్నింగ్ షో నుంచి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న జూనియర్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి బుకింగ్స్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. జూలై 18 సాయంత్రం 4 గంటల వరకు తెలుగులో 19 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదవ్వగా.. కన్నడంలో 13 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిల్క్ తెలిపింది. హైదరాబాద్‌లో 252 షోలు, బెంగళూరులో 143 షోలు, విజయవాడలో 65, విశాఖలో 66 షోలు ప్రదర్శితమయ్యాయి. ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ అదిరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. జూనియర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 3 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కిరీటీ రెడ్డి ఎలాంటి మేజక్ చేస్తాడో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X