Junior Box Office Day 2: జూనియర్ రెండో రోజు కలెక్షన్స్.. శ్రీలీల మూవీకి ఎన్ని కోట్లంటే?
దేశంలోనే పేరొందిన వ్యాపారవేత్త, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటీ రెడ్డి, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం జూనియర్. వారాహి చలన చిత్ర, సాయి కొర్రపాటి ప్రొడక్షన్ బ్యానర్‌పై రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ జూనియర్ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. రవిచంద్రన్, జెనీలియా, రావు రమేష్, సత్య, వైవా హర్ష, అచ్యుత్ కుమార్, సుధారాణి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా.. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. రెండో రోజు జూనియర్ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలి? ఈ వివరాల్లోకి వెళితే..
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార ఖర్చులు కలిపి జూనియర్ చిత్రాన్ని దాదాపు 25 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. గాలి జనార్థన్ రెడ్డి కుమారుడి డెబ్యూ మూవీ కావడంతో పాటు శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు పనిచేయడంతో జూనియర్ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. జూనియర్ మూవీకి తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, ఓవర్సీస్‌లో బాగానే బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. జూనియర్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద రూ.10 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రావాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ప్రపంచవ్యాప్తంగా జూనియర్ మూవీని 1100 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

జూనియర్ తొలి రోజు వసూళ్లు
మార్నింగ్ షో నుంచి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న జూనియర్ మూవీ డల్‌గానే బాక్సాఫీస్ వద్ద జర్నీ ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.1.4 కోట్లు, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 25 లక్షల రూపాయల చొప్పున తొలి రోజు జూనియర్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ.2.20 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి. ఓ డెబ్యూ మూవీ హీరోకి ఈ ఓపెనింగ్స్ మంచి నెంబర్సే అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ నేపథ్యంలో కిరీటీ రెడ్డి మూవీకి రెండో రోజు ఎన్ని కోట్లు వచ్చాయోనని ఉత్కంఠ నెలకొంది.
జూనియర్ రెండో రోజు వసూళ్లు
శ్రీలీల అందం, కిరీటీ రెడ్డి డ్యాన్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. వీకెండ్ కావడంతో ఈ సినిమాకు మంచి బుకింగ్స్ జరుగుతున్నట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మొదటి రోజు 34.5 వేల రేంజ్‌లో టికెట్ సేల్స్‌ను నమోదు చేసుకున్న జూనియర్ మూవీ .. రెండో రోజు కూడా అటు ఇటుగా ఇదే స్థాయిలో బుకింగ్స్ నమోదవుతాయని భావిస్తున్నారు.
రెండో రోజు సాయంత్రం 5 గంటల వరకు తెలుగు వెర్షన్‌లో 21.32 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదవ్వగా.. కన్నడ వెర్షన్‌లో 14.57 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 249 షోలు, విజయవాడలో 65, విశాఖలో 69 షోలు, బెంగళూరులో 134 షోలు చొప్పున ప్రదర్శితమయ్యాయి. గాలి కిరీటీ రెడ్డి మూవీకి రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. అయితే తన పెట్టుబడిని వెనక్కి తీసుకురావాలంటే కిరిటీ రెడ్డి మరింత విజృంభించాలని విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











