Junior Box Office Day 3: శ్రీలీల మ్యాజిక్ .. జూనియర్ మూవీకి 3వ రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటీ రెడ్డిని పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం జూనియర్. ఇందులో కిరీటీ పక్కన శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. రవిచంద్రన్, జెనీలియా, రావు రమేష్, సత్య, వైవా హర్ష, అచ్యుత్ కుమార్, సుధారాణి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. వారాహి చలన చిత్ర, సాయి కొర్రపాటి ప్రొడక్షన్ బ్యానర్‌పై రజనీ కొర్రపాటి ఈ జూనియర్ చిత్రాన్ని నిర్మించారు. రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 18న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేయగా.. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. మూడు రోజుల్లో జూనియర్ మూవీ ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఈ సినిమా నష్టాలు తప్పించుకోవాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలి? ఈ వివరాల్లోకి వెళితే..

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార ఖర్చులు కలిపి జూనియర్ చిత్రాన్ని దాదాపు 25 కోట్ల రూపాయల బడ్జెట్‌‌తో నిర్మించారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద రూ.10 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రావాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. రిలీజ్‌కు ముందు మంచి హైప్ తెచ్చుకోగా.. ప్రపంచవ్యాప్తంగా జూనియర్ మూవీని 1100 స్క్రీన్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.

Junior Day 3 Expected Box Office Collections Worldwide Kireeti and Sreeleela s film study at gboc

జూనియర్ రెండు రోజుల వసూళ్లు
జూనియర్ మూవీ ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 2.20 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. మౌత్ టాక్, శ్రీలీల కారణంగా వీకెండ్ నుంచి ఈ సినిమాకు రెండో రోజు బుకింగ్స్ బాగా పెరిగాయి. రెండో రోజు జూనియర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2.50 కోట్ల రూపాయలు వసూలు చేసి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. మొత్తంగా రెండ్రోజుల్లో ఇండియా వైడ్ 2.25 కోట్ల రూపాయల నెట్.. 4.50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించాడు కిరీటీ.

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 1.3 కోట్లు, రెండో రోజున రూ.1.65 కోట్లు చొప్పున రెండ్రోజుల్లో నికరంగా 3 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. కర్ణాటక + ఇతర రాష్ట్రాల్లో రెండ్రోజుల వరకు 1.50 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయల చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది జూనియర్ మూవీ.

జూనియర్ మూడో రోజు వసూళ్లు
మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ గాలి కిరీటీ రెడ్డి మూవీకి కలెక్షన్స్ డీసెంట్‌గా వస్తున్నాయని ట్రేండ్ పండితులు చెబుతున్నారు. ఆదివారం కావడంతో జూనియర్ సినిమాకు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో మంచి బుకింగ్స్ జరిగినట్లు సాక్‌నిల్క్ చెబుతోంది. సాయంత్రం 4 గంటల వరకు తెలుగు వెర్షన్‌లో 25.50 శాతం, కన్నడ వెర్షన్‌లో 23.25 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. రెండో రోజు బుకింగ్స్‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువని విశ్లేషకులు చెబుతున్నారు.

మూడో రోజు జూనియర్ మూవీ వసూళ్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల నుంచి మరోసారి మెజారిటీ షేర్ దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మూడో రోజు ఇక్కడ రూ.1.80 కోట్లు, కర్ణాటక + ఇతర రాష్ట్రాల్లో 50 లక్షలు, ఓవర్సీస్‌లో 20 లక్షల రూపాయల చొప్పున జూనియర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.2.50 కోట్ల వసూళ్లు రాబడుతుందని చెబుతున్నారు. తద్వారా మూడు రోజుల్లో శ్రీలీల మూవీ 8 కోట్ల రూపాయల మార్క్ అందుకోవచ్చని అంచనా. ఈ సినిమా థియేట్రికల్‌గా లాభాల్లోకి రావాలంటే మరో 12 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X