Junior Box Office Day 4: భారీ డ్రాప్.. జూనియర్ సినిమా 4వ రోజు కలెక్షన్లు.. ఎంత వసూలైందంటే?

బైలింగ్వువల్ గా రూపుదిద్దుకున్న చిత్రం జూనియర్. తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటీ రెడ్డి పరిచయ సినిమా ఇది. శ్రీలీలా హీరోయిన్ గా నటించింది. రవిచంద్రన్, జెనీలియా, రావు రమేష్, సత్య కీలక పాత్రలో పోషించారు. వారాహి చలన చిత్ర, సాయి కొర్రపాటి ప్రొడక్షన్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మించారు. రజనీ కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించారు. రాధా కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. జూలై 18న వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 4వ రోజు కలెక్షన్లు ఎంత వసూలైందనే వివరాల్లోకి వెళితే..

జూనియర్ చిత్రం బడ్జెట్?
టాప్ హీరోయిన్ శ్రీలీలా నటించడం, గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరిటీ తొలి పరిచయం కావడంతో సినిమాకు కాస్తా భారీగానే ఖర్చు చేశారు. ఈ చిత్రానికి టాప్ సినిమాటోగ్రాఫర్‌ కేకే సెంథిల్ కుమార్ పనిచేయడం విశేషం. ఇక రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం, జెనీలియా రీఎంట్రీ ఇవ్వడంతో సినిమా ఖర్చు కాస్తా ఎక్కువనే అయ్యింది. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలుపుకొని ఈ చిత్రానికి రూ.25 కోట్లు ఖర్చు అయినట్టు ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

Junior Day 4 Expected Box Office Collections Worldwide

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
కిరిటీ రెడ్డి తొలి చిత్రం కావడం, శ్రీలీలా, జెనీలియా వంటి స్టార్ బ్యూటీలు నటించడం, టాప్ టెక్నీషియన్లు పనిచేయడంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో చిత్రం లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద థియేట్రికల్ రన్ ద్వారా రూ.10 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు. ప్రస్తుతం సినిమాకు శ్రీలీలా, దేవీ శ్రీప్రసాద్ సంగీతం ద్వారా మంచి బజ్ ఏర్పడింది.

జూనియర్ 3 రోజుల కలెక్షన్స్..
1100 స్కీన్లలో విడుదలైన జూనియర్ చిత్రానికి ఓపెనింగ్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ.2.20 కోట్లు వసూళ్లు చేయడం విశేషం. 2వ రోజు రూ.2.50 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. 3వ రోజు 4.50 కోట్ల గ్రాస్ వసూళ్ల చేసింది. ఇక 3 రోజుల వరకు 8.30 కోట్ల రూపాయలు వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

జూనియర్ 4వ రోజు వసూళ్లు..
4వ రోజు జూనియర్ చిత్రానికి భారీగా వసూళ్లు తగ్గిపోయాయి. సోమవారం వర్కింగ్ డే కావడంతో సినిమా కలెక్షన్లలో కోత పడింది. ఇండియా నెట్ రూ.50 లక్షల వరకు వసూల్ చేసింది. గ్రాస్ రూ.1 కోటీ వరకు వసూల్ చేసింది. దీంతో జూనియర్ చిత్రానికి 4 రోజుల్లో ఇండియా + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని 10 కోట్ల వరకు వసూల్ చేసింది. మరో 10 కోట్లు కలెక్ట్ చేస్తే జూనియర్ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కానుంది. తొలి వారంలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేస్తుందా? అనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X