Junior Box Office Day 5: భారీగా క్షీణించిన జూనియర్ కలెక్షన్స్.. 5వ రోజు శ్రీలీల మూవీకి ఎన్ని కోట్లంటే?
మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటీ రెడ్డి డెబ్యూ మూవీ జూనియర్. శ్రీలీల హీరోయిన్‌గా నటించగా.. రవిచంద్రన్, జెనీలియా, రావు రమేష్, సత్య, వైవా హర్ష, అచ్యుత్ కుమార్, సుధారాణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. వారాహి చలన చిత్ర, సాయి కొర్రపాటి ప్రొడక్షన్ బ్యానర్‌పై రజనీ కొర్రపాటి ఈ జూనియర్ చిత్రాన్ని నిర్మించారు. రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన జూనియర్ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేయగా.. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. 5 రోజుల్లో జూనియర్ మూవీ ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలి? ఈ వివరాల్లోకి వెళితే..
జూనియర్ బడ్జెట్ & బిజినెస్
టాలెంటెడ్ నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార ఖర్చులు కలిపి జూనియర్ చిత్రానికి దాదాపు 25 కోట్ల రూపాయల వ్యయం అయ్యింది. గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తూ ఉండటంతో పాటు శ్రీలీలతో కిరీటీ చేసిన వైరల్ వయ్యారి సాంగ్‌తో జూనియర్ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. డెబ్యూ హీరో సినిమా అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బాగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద రూ.10 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రావాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ప్రపంచవ్యాప్తంగా జూనియర్ మూవీని 1100 స్క్రీన్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.

జూనియర్ నాలుగు రోజుల వసూళ్లు
జూనియర్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 2.20 కోట్ల రూపాయలు, 2వరోజు 2 కోట్ల రూపాయలు, 3వ రోజు 2.50 కోట్ల రూపాయలు, 4వ రోజు కోటి లక్షల రూపాయల చొప్పున నికరంగా 9 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ విషయానికి వస్తే నైజాంలో 3.20 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో కోటి 20 లక్షల రూపాయలు, ఆంధ్రలో 2.80 కోట్ల రూపాయల చొప్పున 7.20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టగా.. 3.73 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా+ ఓవర్సీస్‌లో 2.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. దాంతో నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా జూనియర్ మూవీకి 10 కోట్ల రూపాయల గ్రాస్.. 5.24 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లుగా మార్కెట్ వర్గాలు తెలిపాయి.
జూనియర్ ఐదు రోజుల వసూళ్లు
కిరీటీ రెడ్డి, శ్రీలీల, ఇతర చిత్ర యూనిట్ సభ్యులు చేసిన ప్రమోషనల్ కార్యక్రమాలతో తొలి వారం జూనియర్ మూవీ మంచి వసూళ్లు రాబట్టింది. ఒక డెబ్యూ హీరోకి ఈ స్థాయి డీసెంట్ కలెక్షన్స్ విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచింది. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలు కావడంతో కలెక్షన్స్ బాగా పడిపోయాయి. ప్రధాన నగరాల్లో ఓ మోస్తరుగా బుకింగ్స్ జరుగుతుండగా.. చాలా ఏరియాలలో టికెట్లు తెగడం లేదు. 5వ రోజున జూనియర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా నికరంగా రూ.50 లక్షలు రాబట్ట వచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీంతో శ్రీలీల మూవీకి ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.10.50 కోట్ల రూపాయల రాబట్టవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
జూలై 24న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సహా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ చిత్రాల రిలీజ్‌లు ఉండటంతో బుధవారం నాటికి జూనియర్ మూవీ భవిష్యత్తు తేలిపోనుంది. గాలి కిరీటీ రెడ్డి మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద మరో 9 కోట్ల రూపాయల గ్రాస్.. 4 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది. మరో 48 గంటల్లో జూనియర్ ఏం చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











