జూ ఎన్టీఆర్ చివరి 5 చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఏ చిత్రంతో భారీ లాభం వచ్చిందంటే?
గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత తారక్ భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తొలిసారిగా హిందీ చిత్రం వార్ 2తో బాలీవుడ్ లోనూ అడుగు పెట్టారు. ఈ చిత్రం ఎన్ని వందల కోట్లు సంపాదిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో RRR మినహా చివరి 5 చిత్రాల బాక్సాఫీస్ రిపోర్ట్ ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే..
టెంపర్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం టెంపర్. 2015లో ఈ చిత్రం విడుదలైంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్. థమన్ సంగీతం అందించారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ తో బండ్ల గణేశ్ రూ.35 కోట్లతో నిర్మించారు. 2015 ఫిబ్రవరి 13న విడుదలై బాక్సాఫీస్ వద్ద 75 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ చేసింది.

నాన్నకు ప్రేమతో..
బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా రూపుదిద్దుకున్న తెలుగు యాక్షన్ డ్రామా నాన్నకు ప్రేమతో. ఫాదర్ సెంటిమెంట్ ను చూపించిన ఈ చిత్రానికి కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. జూ ఎన్టీఆర్ - సుకుమార్ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. 45 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం 2016 జనవరి 13న విడుదలైంది. బాక్సాఫీస్ నుంచి తిరిగి 90 కోట్ల వరకు వసూళ్లు చేసింది.
జనతా గ్యారేజ్..
కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న విజిలెంట్ యాక్షన్ ఫిల్మ్ జనతా గ్యారేజ్. ఈ చిత్రంలో మలయాళం స్టార్ మోహన్ లాల్ నటించడం విశేషం. ఇక సమంత రూత్ ప్రభు, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రూ.50 కోట్లతో నిర్మించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ నుంచి రూ.140 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది.
జై లవ కుశ..
బాబీ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ జై లవ కుశ. ఈ చిత్రంలో తారక్, రాశీ ఖన్నా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎన్టీఆర్ట్స్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించారు. 45 కోట్ల రూపాయలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ నుంచి రూ.150 కోట్లు తిరిగి రాబట్టడం విశేషం.
అరవింద సమేత వీర రాఘవ..
త్రివిక్రమ్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషణ్ లో రూపుదిద్దుకున్న చిత్రం అరవింద సమేత వీర రాఘవ. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్ రాధకృష్ణ నిర్మించారు. 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి 190 కోట్ల రూపాయల గ్రాస్ తిరిగి వచ్చింది.
దేవర పార్ట్ : 1
ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవర : పార్ట్ 1 చిత్రం అన్ని చిత్రాల కంటే హ్యయేస్ట్ గ్రాస్ వసూల్ చేసింది. అయితే ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవడం విశేషం. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందించింది. అయితే కలెక్షన్ల పరంగా దేవర రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించినప్పటికీ.. జై లవ కుశ చిత్రం మాత్రం 50 కోట్లకు పైగా లాభాన్ని తెచ్చిపెట్టిందని ట్రేడ్ లెక్కల ద్వారా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











