Jurassic World Dominion Day 1 collections : టాక్ ఎలా ఉన్నా...ఇండియాలో అద్భుతమైన కలెక్షన్స్!

1993లో స్టీవెన్ స్పీల్బర్గ్ సృష్టించిన జురాసిక్ పార్క్ వరల్డ్ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అప్పటి యూత్ అంత ఈజీగా మర్చిపోలేరనే చెప్పాలి. టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లోనే డైనోసర్ల రూపంలో తెరమీద వాటి విలయాన్ని చూపించిన తీరు ఆరోజుల్లోనే వేల కోట్ల రూపాయల వసూళ్లను సాధించి పెట్టింది. ఈ సిరీస్ లో వచ్చిన ఆఖరు సినిమా జురాసిక్ వరల్డ్ డొమినియన్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజయ్యింది. ఒక రోజు ముందే ప్రీమియర్లు ఇండియా వైడ్ వేశారు. మరి మొదటి రోజు ఈ సినిమా ఎంత సాధించింది అనేది చూద్దాం.

ప్రపంచ సినిమా చరిత్రలో సంచలన దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ అద్భుతమైన గ్రాఫిక్స్‌తో జురాసిక్ పార్క్ సినిమాతో వివిధ రకాల సైజులో డైనోసార్లను ప్రేక్షకులకు పరిచయం చేసి థ్రిల్ అందించారు. హాలీవుడ్‌లో ఎన్నడూ లేని విధంగా కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో కొత్త తరహా చిత్రాలను అందించాడు. ఇప్పటికీ జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీ నుంచి సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులంతా ఎదురు చూస్తూ ఉంటారు.

తాజాగా జురాసిక్ ఫ్రాంచైజీగా వచ్చిన జురాసిక్ వరల్డ్ డొమినియన్ చిత్రం మాత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. బాక్స్ ఆఫీస్ ఇండియా లెక్కల ప్రకారం, "హాలీవుడ్ చిత్రం జురాసిక్ వరల్డ్ డొమినియన్ భారతదేశం అంతటా పెద్ద ఎత్తున విడుదలైంది. దీంతో ఈ ఫ్రాంచైజీకి అత్యధిక ఓపెనింగ్‌ సినిమాగా నిలిచే అవకాశం ఉంది.

Jurassic World Dominion Day 1 collections in india

ఇక 2015లో జురాసిక్ వరల్డ్ యొక్క ఓపెనింగ్ డే నంబర్‌లను తాజా చిత్రం కలెక్షన్స్ తో అధిగమించింది. ఈ ఫ్రాంచైజ్ సినిమాకు భారీగా ఓపెనింగ్స్ వచ్చాయని అంటున్నారు. అయితే ఈ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన గత రెండు సినిమాలు లాంగ్ రన్ ద్వారా భారీ కలెక్షన్స్ రాబట్టాయి. అయితే తాజాగా విడుదలైన సినిమాకు మొదటి రోజు రెండంకెల సంఖ్య చాలా దూరం కావచ్చు, అయితే ఈ సినిమా 8 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిందని చెబుతున్నారు.

జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీ 1994లో హాలీవుడ్ చిత్రాల డబ్బింగ్తో ప్రారంభమైంది, ఆ సమయంలో ఆ చిత్రం భారీ బిజినెస్ చేసింది. జురాసిక్ వరల్డ్ డొమినియన్ గురువారం ప్రివ్యూల కలెక్షన్స్ కూడా దాదాపు 3.75 కోట్ల నికర కలెక్షన్లతో బాగానే రాబట్టింది. ఇక షోలు ప్రారంభమైనప్పుడు సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే ఈ కలెక్షన్లు వచ్చాయి. శని, ఆదివారాల్లో కూడా సినిమా మంచి స్కోర్‌ను సాధిస్తుంది'' అని బాక్స్ ఆఫీస్ ఇండియా కధనంలో పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X