Jurassic World Rebirth BoxOffice: 9000 కోట్ల కలెక్షన్లు.. ఇండియాలో జుారాసిక్ వరల్డ్ రీబర్త్‌కి ఎన్ని కోట్లంటే?
హాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలు యూనివర్సల్ పిక్చర్స్, అంబ్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఫ్రాంక్ మార్షల్, ప్యాట్రిక్ క్రైటీ నిర్మాతలుగా గ్యారెత్ ఎడ్వార్డ్స్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జుారాసిక్ వరల్డ్ రీ బర్త్. స్కార్లెట్ జాన్సన్, మహెర్షాలా ఆలీ, జోనాథన్ బెయిలీ, రూపర్ట్ ఫ్రెండ్, ఎడ్ స్క్రేన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూలై 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజై భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా విషయానికి వస్తే.. అమెరికన్ సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా జురాసిక్ వరల్డ్ డామినియన్ సీక్వెల్‌గా రూపొందింది. ఇది నాలుగో జురాసిక వరల్డ్ సినిమా. జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో ఏడో సినిమాగా రూపొందింది. నెటి టెక్నాలజీ హుంగులతో ఈ సినిమాను అత్యంత భారీగా రిచ్‌గా చిత్రీకరించారు. ఈ సినిమాను 180 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 1550 కోట్ల రూపాయలతో నిర్మించారు.

జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ సుమారుగా 70 దేశాల్లో రిలీజ్ అయింది. చైనా, కొరియా, ఆస్ట్రేలియా, యూకే, నార్త్ అమెరికా, మెక్సికో, గల్ఫ్, సింగపూర్, మలేషియా, ఇటలీ, ఐర్లాండ్, స్పెయిన్, బ్రెజిల్ తదితర దేశాల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రేడ్ అంచనాల కంటే తక్కువగా బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.
గురువారమే ఈ సినిమా ప్రీమియర్లు పలు దేశాల్లో మొదలయ్యాయి. గురువారం అంటే జూలై 3వ తేదీన 22 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక తొలి రోజున ఈ సినిమా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద 49 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా 105 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 9000 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని డెడ్‌లైన్ వెబ్‌సైట్ పేర్కొన్నది.
ఇండియాలో ఈ సినిమా గ్రాండ్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమాకు నార్త్ ఇండియాలో మంచి ఆదరణ లభించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో భారీగా ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో ఈ సినిమా తొలి రోజు 9 కోట్ల నెట్ కలెక్షన్లు, రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇంగ్లీష్ వెర్షన్ 5 కో ట్ల రూపాయలు, తమిళం వెర్షన్ కోటి రూపాయలు, హిందీ వెర్షన్ 2.5 కోట్ల రూపాయలు, తెలుగు వెర్షన్ 50 లక్షలు వసూలు చేసింది అని సాక్ నిల్క్ వెల్లడించింది.
ఇండియాలో జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా కలెక్షన్లు తొలి రోజు కంటే రెండో రోజు భారీగా పెరిగాయి. ఈ సినిమా రెండో రోజు 12 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లోనే 21 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా మూడో రోజు కూడా భారీగా వసూళ్లు సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











