Juraasic World Rebirth Collections: 10 రోజుల్లో 5000 కోట్లు వసూళ్లు.. ఇండియాలో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

హాలీవుడ్ చిత్రాలకు ఇండియాలో ఎంతటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇటీవల వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన జురాసిక్ వరల్డ్ రీ బర్త్ (Juraasic World Rebirth) బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. హాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలు యూనివర్సల్ పిక్చర్స్, అంబ్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఫ్రాంక్ మార్షల్, ప్యాట్రిక్ క్రైటీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గ్యారెత్ ఎడ్వార్డ్స్ దర్శకత్వం వహించారు. స్కార్లెట్ జాన్సన్, మహెర్షాలా ఆలీ, జోనాథన్ బెయిలీ కీలక పాత్రల్లో నటించారు. జూలై 04న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద వేల కోట్లల్లో వసూళ్లు దక్కుతుండటం విశేషం. ఈ క్రమంలో సినిమా బడ్జెట్ ఎంత? 10 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్ని వేల కోట్లు సంపాదించింది? ముఖ్యంగా ఇండియాలో ఎన్ని కోట్లు సంపాదించిందనే వివరాల్లోకి వెళితే..

జురాసిక్ వరల్డ్ రీబర్త్ బడ్జెట్?
సాధారణంగానే హాలీవుడ్ చిత్రాలకు భారీ బడ్జెట్ కేటాయిస్తారనే సంగతి తెలిసిందే. ఇక జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా విషయానికి వస్తే అమెరికన్ సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్‌గా రూపొందింది. జురాసిక్ వరల్డ్ డామినియన్ సీక్వెల్‌గా రూపొందిద్దుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఇప్పటికే 6 ఫ్రాంచైజీలను తీసుకురాగా, తాజాగా 7వ ఫ్రాంచైజీని విడుదల చేశారు. భారీ విజువల్స్ ను క్రియేట్ చేయడం కోసం టాప్ టెక్నీషియన్లతో పనిచేయించారు. హాలీవుడ్ స్టార్ యాక్టర్స్ రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, వరల్డ్ వైడ్ ప్రమోషన్స్ కోసం 180 మిలియన్ల డాలర్ల (1550 కోట్ల రూపాయలు)ను ఖర్చు పెట్టారు.

Jurassic World Rebirth Day 10 Box Office Collections Worldwide

ఏఏ దేశాల్లో విడుదలైందంటే..
జురాసిక్ వరల్డ్ ఫ్ఱాంచైజీకి వరల్డ్ వైడ్ అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ ఏకంగా 80కి పైగా దేశాల్లో విడుదలవటం విశేషం. వీటిలో ఇండియాతో పాటు.. యూకే, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, చైనా, కొరియా, మెక్సికో, గల్ఫ్, ఇటలీ, ఐర్లాండ్, స్పెయిన్, బ్రెజిల్ వంటి దేశాల్లో విడుదలైంది. అన్ని దేశాల్లో రికార్డు స్థాయిలో వసూళ్లను అందుకుంటోంది. ప్రస్తుతం ఇండియాలోనూ 10 రోజుల్లోనే కోట్లల్లో వసూళ్లు అందుకుంటోంది. త్వరలోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరుకోబోతోంది.

2 రోజుల్లోనే లాభాల్లోకి..
హాలీవుడ్ చిత్రాలకు నార్మల్ గానే మంచి రిటర్న్ ను ఉంటాయి. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు అదిరిపోతుంటాయి. ఇక జురాసిక్ ఫ్రాంచైజీకి వరల్డ్ వైడ్ గా ఆదరణ దక్కింది. దీంతో వరుస సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నారు. మంచి లాభాలను రాబడుతున్నారు. ఈ క్రమంలో జురాసిక్ వరల్డ్ రీబర్త్ కేవలం 2 రోజుల్లోనే లాభాల్లోకి వచ్చింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ రూ.800 కోట్లు వసూల్ చేయగా.. 2వ రోజుకు 2000 కోట్ల క్లబ్ లోకి చేరింది. దీంతో 2 రోజుల్లోనే లాభాల బాటలోకి వచ్చింది.

ఇండియాలో వసూళ్లు..
ఇప్పటి వరకు ఇండియాలో ఇంగ్లీష్ వెర్షన్ రూ.34.1 కోట్ల నెట్, తమిళంలో రూ.8.92 కోట్ల నెట్, హిందీలో రూ.28.75 కోట్ల నెట్, తెలుగులో రూ.2.7కోట్ల నెట్ అందుకుంది. ఇప్పటి వరకు కేవలం 10 రోజుల్లో ఇండియా నెట్ రూ.74.5 కోట్లకు చేరుకుంది. ఇండియా గ్రాస్ వసూళ్లు 89.5 కోట్లు అందిందని సాక్ నిల్క్ గణాంకాలు తెలుపుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లో చేరుకోనుంది. ఇక కేవలం 10వ రోజు ఇంగ్లీష్ వెర్షన్ లో రూ.3.1 కోట్లు, తమిళంలో రూ.90 లక్షలు, హిందీలో రూ.3.6 కోట్లు, తెలుగులో రూ.20 లక్షల నెట్ వసూల్ చేసింది. వీటి మొత్తం కలిపి కేవలం 10వ రోజు రూ.7.8 కోట్ల నెట్ వసూలైంది.

వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ వసూళ్లు..
జురాసిక్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు షాకింగ్ వసూళ్లు అందుకుంది. కేవలం ఓవర్సీస్ లోనే రూ.2560 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇక నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో కలుపుకొని వల్డ్ వైడ్ గా రూ.4555 కోట్ల గ్రాస్ అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం 2వ వారంలో భారీగా వసూళ్లు అందుకుంటోంది. రెండు రోజుల్లో ఈ చిత్రం 5000 వేల కోట్ల క్లబ్ లో చేరనుందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X