Jurassic World Rebirth Box Office: జురాసిక్ వరల్డ్ ప్రభంజనం.. 3 రోజుల్లో 2500 కోట్లు..ఇండియాలో ఎన్ని కోట్లంటే?
జురాసిక్ వరల్డ్‌లో భాగంగా వచ్చిన జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా ఇండియాలో భారీగా వసూళ్లు సాధిస్తున్నది. ఈ సినిమా కలెక్షన్లు తొలి రోజు కంటే రెండో రోజు భారీగా పెరిగాయి. ఈ సినిమా రెండో రోజు 12 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లోనే 21 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా మూడో రోజు కూడా భారీగా వసూళ్లు సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఇండియాలో రోజు వారీ సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
హాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలు యూనివర్సల్ పిక్చర్స్, అంబ్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఫ్రాంక్ మార్షల్, ప్యాట్రిక్ క్రైటీ నిర్మాతలుగా గ్యారెత్ ఎడ్వార్డ్స్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జుారాసిక్ వరల్డ్ రీ బర్త్. స్కార్లెట్ జాన్సన్, మహెర్షాలా ఆలీ, జోనాథన్ బెయిలీ, రూపర్ట్ ఫ్రెండ్, ఎడ్ స్క్రేన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూలై 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజైంది.

జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా విషయానికి వస్తే.. అమెరికన్ సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా జురాసిక్ వరల్డ్ డామినియన్ సీక్వెల్‌గా రూపొందింది. ఇది నాలుగో జురాసిక వరల్డ్ సినిమా. జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో ఏడో సినిమాగా రూపొందింది. నెటి టెక్నాలజీ హుంగులతో ఈ సినిమాను అత్యంత భారీగా రిచ్‌గా చిత్రీకరించారు. ఈ సినిమాను 180 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 1550 కోట్ల రూపాయలతో నిర్మించారు.
జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ సుమారుగా 70 దేశాల్లో రిలీజ్ అయింది. చైనా, కొరియా, ఆస్ట్రేలియా, యూకే, నార్త్ అమెరికా, మెక్సికో, గల్ఫ్, సింగపూర్, మలేషియా, ఇటలీ, ఐర్లాండ్, స్పెయిన్, బ్రెజిల్ తదితర దేశాల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రేడ్ అంచనాల కంటే తక్కువగా బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.
ఇండియాలో ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఇంగ్లీష్ వెర్షన్ 4.75 కోట్లు, తమిళ్ 1.1 కోట్లు, హిందీ 2.75 కోట్లు, తెలుగు 40 లక్షల రూపాయల వసూళ్లతో 9 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక రెండో రోజు ఇంగ్లీష్ వెర్షన్ 6.75 కోట్లు, తమిళంలో 1.65 కోట్లు, హిందీలో 4.6 కోట్లు తెలుగులో 50 లక్షలు వసూళ్లతో 13.5 కోట్ల కలెక్ట్ చేసింది అని సాక్ నిల్క్ వెల్లడించింది.
ఇక జురాసిక్ వరల్డ్ రీబర్త్ తొలి రెండు రోజుల కంటే ఈ మూవీ మడో రోజు అత్యధికంగా వసూళ్లను రాబట్టింది. ఇంగ్లీష్ వెర్షన్ 8 కోట్లు, తమిళంలో 2 కోట్లు, హిందీలో 5 కోట్ల, తెలుగులో 75 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో మూడో రోజు ఈ సినిమా 15.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సిినమా ఇప్పటి వరకు 38.25 కోట్ల రూపాయలు ఇండియాలో కలెక్ట్ చేసింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ సంచలన రీతిలో వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం గత 3 రోజుల్లో 10.8 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ సినిమా చైనాలో మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకానింగ్ సినిమా రికార్డును బీట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తొలి వారం ముగిసే సమయానికి ఈ చిత్రం 300 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 2500 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











