4 రోజుల్లో 2800 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్లు.. ఇండియాలో జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీకి ఎన్ని కోట్లంటే?

జురాసిక్ వరల్డ్‌లో భాగంగా వచ్చిన జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా ఇండియాలో భారీగా వసూళ్లు సాధిస్తున్నది. హాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలు యూనివర్సల్ పిక్చర్స్, అంబ్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఫ్రాంక్ మార్షల్, ప్యాట్రిక్ క్రైటీ నిర్మాతలుగా గ్యారెత్ ఎడ్వార్డ్స్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జుారాసిక్ వరల్డ్ రీ బర్త్. స్కార్లెట్ జాన్సన్, మహెర్షాలా ఆలీ, జోనాథన్ బెయిలీ, రూపర్ట్ ఫ్రెండ్, ఎడ్ స్క్రేన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూలై 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఇండియాలో కలెక్షన్లు ఎంత? ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రిపోర్టు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా విషయానికి వస్తే.. అమెరికన్ సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా జురాసిక్ వరల్డ్ డామినియన్ సీక్వెల్‌గా రూపొందింది. ఇది నాలుగో జురాసిక వరల్డ్ సినిమా. జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో ఏడో సినిమాగా రూపొందింది. నెటి టెక్నాలజీ హుంగులతో ఈ సినిమాను అత్యంత భారీగా రిచ్‌గా చిత్రీకరించారు. ఈ సినిమాను 180 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 1550 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Jurassic World Rebirth Day 4 Box Office

జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ సుమారుగా 80కిపైగా దేశాల్లో రిలీజ్ అయింది. చైనా, కొరియా, ఆస్ట్రేలియా, యూకే, నార్త్ అమెరికా, మెక్సికో, గల్ఫ్, సింగపూర్, మలేషియా, ఇటలీ, ఐర్లాండ్, స్పెయిన్, బ్రెజిల్ తదితర దేశాల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రేడ్ అంచనాల కంటే తక్కువగా బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. నార్త్ అమెరికా, చైనాలో ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధిస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇండియాలో జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీకి భారీగా అభిమానులు ఉన్నారనే విషయం కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇక జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమాకు కూడా భారీ ఆదరణ అభిమానుల నుంచి వచ్చింది. ఈ సినిమా తొలి రోజు 9.25 కోట్ల రూపాయలు, రెండో రోజు 13.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 16.25 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని సాక్ నిల్క్ వెల్లడించింది. దాంతో ఈ సినిమా 43 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లను రాబట్టింది.

ఇక ఇండియాలో వివిధ భాషల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. గత మూడు రోజుల్లో ఇంగ్లీష్ వెర్షన్ 21 కోట్ల రూపాయలు, తమిళంలో 5.5 కోట్ల రూపాయలు, హిందీలో 16 కోట్ల రూపాయలు, తెలుగు వెర్షన్‌లో 2 కో ట్ల రూపాయలు వసూలు వసూలు చేసింది. ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 43.5 కోట్ల రూపాయల నెట్, 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని సాక్ నిల్క్ రిపోర్టులో వెల్లడైంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు వివరాల్లోకి వెళితే.. నార్త్ అమెరికాలో 150 మిలియన్ డాలర్లు, ఓవర్సీస్‌లో 175 మిలియన్ డాలర్లతో మొత్తంగా 325 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 2800 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నది. యూకే, చైనా లాంటి ఇంటర్నేషనల్ మార్కెట్‌లో నిలకడగా కలెక్షన్లు రాబడుతున్నది. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్లు 500 మిలియన్ డాలర్లకుపైగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X