100 కోట్ల బిజినెస్.. దెబ్బకు లెక్కలు మారిన విశ్వంభర థియేట్రికల్ రైట్స్
తెలుగు సినిమా దగ్గర ఎన్నో దశాబ్దాల పాటుగా నెంబర్ 1 హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది నిర్మొహమాటంగా మెగాస్టార్ చిరంజీవే అని చెప్పవచ్చు. కాగా మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మార్కెట్ అంతా ఇంత కాదు. తనతో ఉన్న ఎంతోమంది స్టార్ హీరోస్ సైతం తన రేంజ్ లో మార్కెట్ ని కొనసాగించలేకపోయారు. అలా తెలుగు మార్కెట్ లో స్పెషల్ ప్లేస్ సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇపుడు తన మార్కెట్ విషయంలో స్ట్రగుల్ అవుతున్నారు.
కాగా మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ లేదు. రీమేక్ చిత్రాలు గతంలోలా వర్కౌట్ కావడం లేదు. దీనితో ఫ్రెష్ కథల పైనే దృష్టి పెట్టి స్టార్ట్ చేసిన సినిమానే విశ్వంభర. తెలుగు సినిమా దగ్గర తక్కువగా టచ్ చేస్తున్న జానర్ ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి చేస్తున్న ఈ సినిమాని బింబిసార దర్శకుడు వశిష్ట మల్లిడి తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమా అనౌన్స్ చేసినపుడు ఉన్న హైప్ వేరు.

ఎందుకంటే చిరంజీవికి ఫాంటసీ జానర్ చిత్రాలకి స్పెషల్ బాండ్ ఉంది. గతంలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి అలాగే అంజి లాంటి సినిమాలు తెలుగు ఆడియెన్స్ మర్చిపోలేరు. అందుకే ఇది అనౌన్స్ చేసినపుడు ఉన్న హైప్ వేరే లెవెల్. కానీ ఈ సినిమా నుంచి గత ఏడాది దసరా కానుకగా వచ్చిన టీజర్ గ్లింప్స్ మాత్రం సినిమాకి గట్టి దెబ్బ వేసింది. దీనితో మళ్ళీ చాలా పనులు మొదటి నుంచి చేయాల్సి వచ్చింది.
కాగా దీని ప్రభావం సినిమాపై ఉన్న ఓటిటి డీలింగ్ సహా థియేట్రికల్ బిజినెస్ పై కూడా గట్టి ఎఫెక్ట్ చూపించాయి. షాకింగ్ గా ఏ ఓటిటి సంస్థ కూడా ఈ సినిమా కొనేందుకు ముందుకు రాలేదు. కానీ లేటెస్ట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ దెబ్బకి అన్నీ లేచినట్టు తెలుస్తుంది. ఏ సినిమాకి అయినా పర్ఫెక్ట్ ఎలిమెంట్ ఒకటి చాలు ఎక్కడ లేని హైప్ తీసుకురావడానికి.
ఇలా విశ్వంభర నుంచి వచ్చిన మొదటి సాంగ్ దెబ్బకి ఇపుడు బిజినెస్ లెక్కలు మారుతున్నాయట. గతంలోనే ఒక్క తెలుగు రాష్ట్రాల వరకే ఈ సినిమాకి 100 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ ఆఫర్స్ వచ్చాయి. ఇపుడు అంతకు మించే వస్తున్నాయట. ఇందుకు కారణంతో సాంగ్ లో మెగాస్టార్ ని జనం ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించడం.
మెయిన్ గా వింటేజ్ వైబ్స్ ని మైంటైన్ చేయడంతో పాటుగా ఆస్కార్ విన్నర్ కీరవాణి ఇచ్చిన సాంగ్ కూడా పర్ఫెక్ట్ గా కుదరడంతో మళ్ళీ లేని హైప్ ఈ సినిమాకి వచ్చినట్టుగా సినీ వర్గాల్లో వినిపిస్తుంది. దీనితో ఓటిటి ఆఫర్స్ కూడా విశ్వంభర రావడం మొదలయ్యాయట. కాగా మేకర్స్ కూడా ఇదే పాజిటివిటీ మైంటైన్ చేయాలనీ ప్లానింగ్ లో ఉన్నారట. ఇలా అన్నీ కుదిరితే ఈ చిత్రాన్ని మెగాస్టార్ ఇండస్ట్రీ హిట్ ఇంద్ర రిలీజ్ డేట్ లో తీసుకురావాలని మేకర్స్ గట్టి ప్రయత్నాలు ఇపుడు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











