twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'జనతా గ్యారేజ్' ని, 'ఇంకొక్కడు' కలెక్షన్స్ ని దాటేసిన ‘జ్యో అచ్యుతానంద’

    By Srikanya
    |

    హైదరాబాద్‌: శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వంలో నారా రోహిత్‌, నాగశౌర్య, రెజీనా తారాగణంగా విడుదలైన 'జ్యో అచ్యుతానంద' చిత్రం అమెరికాలో చక్కటి వసూళ్లను రాబడుతోంది. వారాంతంలో చిత్రం అద్భుతమైన వసూళ్లను రాబట్టిందని సినీ విశ్లేషకుడు తరణ్‌ఆదర్శ్‌ తెలిపారు.

    ఈ చిత్రం గురువారం(30,893 డాలర్లు), శుక్రవారం (92,143 డాలర్లు), శనివారం (151,103 డాలర్లు), ఆదివారం (75,127 డాలర్లు) మొత్తం(349,239 డాలర్లు) రూ. 2.34 కోట్లు వసూలు చేసిందని ట్వీట్‌ చేశారు. కల్యాణ్‌ రమణ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి సమర్పించారు.

    అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ముఖ్యపాత్రల్లో నటించారు. క్లీన్ 'యు' సర్టిఫికెట్ తో విడుదలైన 'జ్యో అచ్యుతానంద'కు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి స్పందన వస్తోంది.

    స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు...అవసరాల తిరుపతి టూర్ ఫొటోలతో...

    షాకిచ్చిన కలెక్షన్స్

    షాకిచ్చిన కలెక్షన్స్

    అలాగే ఈ చిత్రం ఓవర్ సీస్ కలెక్షన్స్ ...ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ ని, విక్రమ్ ఇంకొక్కడు చిత్రాల ఓపినింగ్ డే కలెక్షన్స్ దాటి షాకిచ్చాయి. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు రావాలంటే హాఫ్ మిలియన్ క్లబ్బులో చేరాలి. అది పెద్ద కష్టం కూడా కాకపోవచ్చు. వచ్చే వారం పెద్ద సినిమాలేమీ లేవు కాబట్టి 'జ్యో అచ్యుతానంద' జోరు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.

    యుఎస్ లో ఫస్ట్ ఛాయిస్ ఇదే

    యుఎస్ లో ఫస్ట్ ఛాయిస్ ఇదే

    జ్యో...ఫుల్ రన్లో 6-7 లక్షల డాలర్ల మధ్య వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా బాగానే ఆడుతోంది. ప్రస్తుతం ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ ఇదే. రెండో వారాంతానికి బయ్యర్లందరూ లాభాల బాటలోకి వచ్చేస్తారని భావిస్తున్నారు. మంచి సినిమాలు తీసే సాయి కొర్రపాటి చాన్నాళ్ల తర్వాత ఓ కమర్షియల్ సక్సెస్ అందుకున్నందుకు అందరూ హ్యాపీగా ఉన్నారు.

    టీమ్ అంతా వెంకన్న సేవలో

    టీమ్ అంతా వెంకన్న సేవలో

    'జ్యో అచ్యుతానంద' చిత్ర యూనిట్ కలియుగ వైకుంఠదైవం శ్రీనివాసుడిని దర్శించుకుంది. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌రాజు, చిత్ర దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌, సంగీత దర్శకుడు కోడూరి కళ్యాణ్‌, నటి సుధాతోపాటు పలువురు ఆర్టిస్టులు స్వామివారిని దర్శించుకున్నారు.

     తిరపతిలో అవసరాల మాట్లాడుతూ..

    తిరపతిలో అవసరాల మాట్లాడుతూ..

    సినిమా పూర్తైన తర్వాత తిరుమల వెంకటేశ్వరుడి దర్శించుకోవాలని ముందే అనుకున్నామని... అందుకే వచ్చామన్నారు. సినిమా విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.మంచి వసూళ్లు కూడా వస్తున్నాయి.

    కొర్రపాటితోనే తదుపరి చిత్రం కూడా

    కొర్రపాటితోనే తదుపరి చిత్రం కూడా

    ఇక నెక్ట్స్ ప్రాజెక్ట్ అంటే కొర్రపాటి సాయి గారితో ఇంకో సినిమా చేస్తున్నాను. కాకపోతే కొంచెం టైమ్ పడుతుంది' అని తెలిపాడు. ఈ చిత్రం హిట్ అయినందుకు కొర్రపాటి చాలా హ్యాపీగా ఉన్నాయి. ఆయనతో తదుపరి చేయబోయే చిత్రం మరింత విభిన్నంగా ఉండబోతోందని చెప్తున్నారు. ఇదే కాంబినేషన్ లో వచ్చే చిత్రంపై ఖచ్చితంగా మంచి అంచనాలు ఉండే అవకాసం ఉంది.

    అన్నమాచార్య కృతి నుంచి తీసుకున్నాం...

    అన్నమాచార్య కృతి నుంచి తీసుకున్నాం...

    'జ్యో అచ్యుతానంద' పదాన్ని అన్నమాచార్య కృతి నుంచి తీసుకుని సినిమా టైటిల్ గా పెట్టుకున్నాం. సినిమా సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది. సాయి గారి బ్యానర్ లో మరో సినిమాకు సంగీతం అందించబోతున్నా..అని తెలిపారు. కళ్యాణ్ మాలిక్ పాటలు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. సంగీతం యాప్ట్ గా ఉందని అంతటా ప్రశంసలు వచ్చాయి.

    యుఎస్ లో రికార్డ్ క్రియేట్ చేస్తుంది

    యుఎస్ లో రికార్డ్ క్రియేట్ చేస్తుంది

    ఈ మధ్యకాలంలో పెళ్లి చూపులు చిత్రం యుఎస్ భాక్సాఫీస్ వద్ద రికార్డ్ లు క్రియేట్ చేసిన చిత్రం. ఇప్పుడు మరో చిత్రం కూడా అదే దారిలో ప్రయాణం పెట్టుకుందని అర్దమవుతోంది. ఆ చిత్రం మరోదో కాదు.. నారా రోహిత్-నాగశౌర్య-రెజీనా ప్రధాన పాత్రల్లో అవసరాల శ్రీనివాస్ రూపొందించిన చిత్రం‘జ్యో అచ్యుతానంద'. ఈ చిత్రం సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి యుఎస్ భాక్సాఫీస్ వద్ద రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది.

    రాజమౌళి రివ్యూ సినిమాకు పబ్లిసిటీ

    రాజమౌళి రివ్యూ సినిమాకు పబ్లిసిటీ

    రాజమౌళి ఈ చిత్రం రిలీజైన వెంటనే సినిమా గురించి రివ్యూ లాంటి ట్వీట్ చేసారు. వారాహి చలన చిత్రం, అవసరాల శ్రీనివాస్‌, కల్యాణ్‌ రమణ కాంబినేషన్‌ మరో చక్కటి ఫ్యామిలీ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘జ్యో అచ్యుతానంద'ని ఇచ్చిందన్నారు. చిత్రం చక్కటి వినోదాన్ని పండించిందని, క్లైమాక్స్‌ 10 నిమిషాలు హృదయాలను తాకుతుందని తెలిపారు. నారా రోహిత్‌, నాగశౌర్య అన్నదమ్ములుగా చాలా బావున్నారని, రెజీనాను తొలిసారి తెరపై చూశానని, ఆమె నటన నచ్చిందని పేర్కొన్నారు. వెంకట్‌ ఫొటోగ్రఫీ చిత్రానికి ప్లస్‌పాయింటని, ఆర్ట్‌ డైరెక్టర్‌ రామ పనితనం బావుందన్నారు. ‘చివరకు మిగిలేది' నవల ప్రస్తావన అందుకు చిన్న ఉదాహరణ అంటూ రాజమౌళి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

    చిత్రం కథ ఇదే..

    చిత్రం కథ ఇదే..

    కథ విషయానికి వస్తే...అచ్యుత్ (నారా రోహిత్), ఆనంద్ (నాగ శౌర్య) బ్రదర్శ్. మిడిల్ క్లాస్ ఆనందాలతో సరదాగా,సరదాగా గడిపేస్తున్న వారి జీవితంలోకి (వారి ఇంటి మేడపైకి) జ్యోత్స్న (రెజీనా) అనే అమ్మాయి అద్దెకు దిగుతుంది. వీళ్లిద్దరూ అమాంతం ఆమెతో ప్రేమలో పడిపోతారు. ఆమెను దక్కించుకోవటానికి పోటీ పడతారు. అయితే జ్యోత్స మాత్రం తాను ఆల్రెడీ ఇంకొకరితో ప్రేమలో ఉన్నానని వీళ్లద్దిరిని రిజెక్టు చేసి వెళ్లిపోతుంది. తర్వాత కొంతకాలానికి అన్నదమ్ముల మధ్య దూరం పెరుగుతుంది. 'అంతేకాదు పెళ్లిళ్లు అవుతాయి. ఆ సమయంలో వీరి జీవితాల్లోకి జ్యోత్స్న మళ్ళీ వస్తుంది. వీళ్లిద్దరికీ ‘ఐ లవ్‌ యూ' చెప్తుంది. తాను ప్రేమించినవాడిని కాదని.. అప్పటికే పెళ్లి చేసుకొన్న అచ్యుత్‌.. ఆనంద్‌లకి జ్యో ‘ఐ లవ్‌ యూ' చెప్పడానికి వెనక కారణమేంటి?అక్కడనుంచి వీరిద్దరి కథ ఏయే మలుపులు తిరిగిందీ? అసలేం జరిగింది, ఎవరికి జ్యోత్స దక్కింది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    మొదటి నుంచీ నవ్విస్తూనే చివరి వరకూ...

    మొదటి నుంచీ నవ్విస్తూనే చివరి వరకూ...

    జ్యో అచ్యుతానంద సినిమాకు ప్లస్ అయింది చెప్పాలంటే కామెడీనే. ఈ సినిమా తొలి నుంచి చివరి వరకూ చాలా భాగం ఫన్ చేస్తూ నడిపేయటమే. అయితే ఫన్ జరుగుతున్న సమయంలో కూడా తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని నిలపెట్టగలగిగాడు. అంతేకాని మైండ్ లెస్ కామెడీ చేయలేదు. లైట్ హార్టెడ్ గా సీన్స్ ని పేర్చుకుంటూ నడిపించేసాడు.

    టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్

    టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్

    ఈ సినిమా చూసినవారంతా దిలీప్‌ కెమెరా పనితనం బాగుందని మెచ్చుకునేవారు. ఈ బడ్జెట్ లో అంత చక్కటి వర్క్ ,కలర్ ఫుల్ గా అందించి సినిమాను నిలబెట్టే ఫిల్లర్స్ లో ఒకడయ్యాడు. ఎడిటింగ్ కూడా క్రిస్ప్ గా ఉంది కానీ, స్లో అయిన చోట ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా బాగున్నాయి. నిర్మాతల అభిరుచిని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. దర్శకుడు అభిరుచికి తగ్గట్లు ఖర్చు పెట్టుకుంటూ వెళ్లాడు. మధ్యతరగతి ఇంటి నేపథ్యాన్ని అందంగా, రియలిస్టిక్‌గా చూపించడంలో సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్ ప్రతిభను గమనించొచ్చు. కిరణ్ గంటి ఎడిటింగ్ చాలా బాగుంది.

     సినిమాకు పనిచేసింది ఎవరెవరంటే

    సినిమాకు పనిచేసింది ఎవరెవరంటే

    సంస్థ: వారాహి చలన చిత్ర
    నటీనటులు : నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా, పావని గంగిరెడ్డి, సీత, రాజేశ్వరి, హేమంత్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి,నాని (గెస్ట్ రోల్ లో) తదితరులు
    సంగీతం : శ్రీ కళ్యాణ్ రమణ
    సినిమాటోగ్రఫీ: వెంకట్ సి. దిలీప్
    ఎడిటింగ్: కిరణ్ గంటి
    కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : అవసరాల శ్రీనివాస్
    నిర్మాత: రజనీ కొర్రపాటి
    సమర్పణ: సాయి కొర్రపాటి
    విడుదల తేదీ : సెప్టెంబర్ 9, 2016

    English summary
    “Jyo Achyutananda” Overseas Box Office Collection of USA country is seen with a bang start and has surpassed the US business of Junior NTR’s Telugu film “Janatha Garage” and Chiyaan Vikram’s “Inkokkadu” on opening day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X