K Ramp Day 1 Collections: కే ర్యాంప్‌ షాకింగ్ ఓపెనింగ్స్.. కిరణ్ అబ్బవరం మూవీకి ఎన్ని కోట్లంటే?

యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ కే ర్యాంప్. దీపావళి కానుకగా అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. గతేడాది దీపావళికి రిలీజైన క సినిమాతో భారీ వసూళ్లు సాధించిన కిరణ్.. మరోసారి దీపావళికే బరిలోకి దిగడంతో ఈ మూవీపై పరిశ్రమలో హైప్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు టీజర్లు, ట్రైలర్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలు కిరణ్ అబ్బవరం మూవీపై అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలో కే ర్యాంప్ మూవీ బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

హాస్య మూవీస్, రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా, శివాజీ బొమ్మక్‌లు సంయుక్తంగా కే ర్యాంప్ మూవీని నిర్మించారు. ఇందులో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తారేజ హీరోయిన్‌గా నటించారు. నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. కే ర్యాంప్ చిత్రానికి సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రాఫర్‌గా, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించగా.. చైతన్ భరద్వాజ్ సంగీత దర్శకత్వం వహించారు.

K Ramp Day 1 Expected Box Office Collections Worldwide Kiran Abbavaram s Movie face tough fight from Diwali movies

కే ర్యాంప్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతి నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి కే ర్యాంప్ చిత్రానికి దాదాపు 4 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే... నైజాం థియేట్రికల్ రైట్స్ 2 కోట్ల రూపాయలు, సీడెడ్‌ థియేట్రికల్ రైట్స్ 1.25 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 3 కోట్ల రూపాయలు చొప్పున ఆంధ్రా, నైజాంలలో 6.25 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే... కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 1.30 కోట్ల రూపాయల చొప్పున మొత్తంగా వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు 8.15 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. కే ర్యాంప్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సీఫీస్ వద్ద 9 కోట్ల రూపాయల షేర్... 18 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు.

కే ర్యాంప్ అడ్వాన్స్ కలెక్షన్స్
కే ర్యాంప్ చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్మురేపింది. అమెరికాలో ప్రీమియర్ సేల్స్‌లో సత్తా చాటింది. కాంతార చాప్టర్ 1, డ్యూడ్, తెలుసు కదా, మిత్రమండలి వంటి సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురైనా కిరణ్ అబ్బవరం తట్టుకుని నిలబడ్డాడు. కే ర్యాంప్ చిత్రానికి అక్టోబర్ 17వ తేదీ మధ్యాహ్నం అమెరికాలో ప్రీమియర్స్ షోలకు సంబంధించి 216 లోకేష‌న్‌లలో 360 షోలకు గాను 2000కు టికెట్లు అమ్ముడయ్యాయి. దాంతో 29 వేల డాలర్లకు (భారత కరెన్సీలో 25.50 లక్షల రూపాయలు) పైగా కలెక్షన్స్ వచ్చాయి. అయితే నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ + అడ్వాన్స్ బుకింగ్స్‌కి సంబంధించి ఇంకొంత డేటా అందాల్సి వచ్చింది. దానితో కలిపి కే ర్యాంప్‌కు అడ్వాన్స్ బుకింగ్‌లోనే ఓవర్సీస్ నుంచి 30 లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

కే ర్యాంప్ తొలిరోజు కలెక్షన్స్
పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో కే ర్యాంప్ సినిమాకు తొలి రోజు బాగానే బుకింగ్స్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు కిరణ్ అబ్బవరం మూవీకి 27 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. యూఎస్ ప్రీమియర్స్, భారత్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ తదితర వాటితో కలిపి కే ర్యాంప్ మూవీకి వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే 3 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే వీకెండ్, దీపావళి సెలవులు కావడంతో కాంతార చాప్టర్ 1, డ్యూడ్, మిత్రమండలి, తెలుసు కదా తదితర సినిమాల నుంచి కే ర్యాంప్‌కు కొంత ఇబ్బందులు తప్పవని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. మరి కిరణ్ అబ్బవరం ఎంత వరకు తట్టుకుని నిలబడతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X