K Ramp Day 11 Collections: బాక్సాఫీస్ వద్ద కే ర్యాంప్ ఎదురీత.. కిరణ్ మూవీ 11 రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
K Ramp Box Office Collection: టాలీవుడ్‌లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరోసారి తన సత్తా చాటుకున్నారు. ఎప్పుడూ విభిన్నమైన కథలను ఎంచుకుంటున్న ఈ యువ హీరో తాజాగా విడుదలైన "కే ర్యాంప్ (K Ramp)" సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ కలిగిన కిరణ్ అబ్బవరం, ఈసారి కొత్త కాన్సెప్ట్‌తో, ఎనర్జిటిక్ ప్రెజెంటేషన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని, అద్భుతమైన కలెక్షన్లు అందుకుంటుంది. ఈ నేపథ్యంలో కే ర్యాంప్ మూవీ బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 11 వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
కే ర్యాంప్ మూవీని యువ దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించారు. ఈ మూవీ యాక్షన్, కామెడీ, ఎమోషన్‌ల మేళవింపుతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగింది. కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తారేజ్ హీరోయిన్‌గా తన అందం, నటనతో ఆకట్టుకుంది. నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. వీరి నటన కూడా సినిమాకు మరింత బలం చేకూరింది. సినిమా అంతటా రసవత్తరమైన సన్నివేశాలు, చక్కటి భావోద్వేగాలు ప్రేక్షకులను థియేటర్‌కు కట్టిపడేస్తున్నాయి.

"కే ర్యాంప్" సినిమాను హాస్య మూవీస్, రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా, శివాజీ బొమ్మక్ లు సంయుక్తంగా నిర్మించారు. సుమారు రూ. 4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి మాసం చూపించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ సినిమాకు రిచ్‌నెస్ కనబడుతోంది. ఎడిటర్ చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు మంచి పేస్ ఇచ్చింది.
సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోశాయి. రిలీజ్ ముందు నుంచే మంచి బిజినెస్ చేసింది. నైజాం రైట్స్ రూ.2 కోట్లు, సీడెడ్ రూ.1.25 కోట్లు, ఆంధ్రా రైట్స్ రూ.3 కోట్లు, కర్ణాటక, ఓవర్సీస్ రైట్స్ కలిపి మొత్తం థియేట్రికల్ బిజినెస్ రూ. 8 కోట్లకు పైగా జరిగింది. లాభాల్లోకి రావాలంటే కనీసం రూ. 9 కోట్ల షేర్ (సుమారు రూ. 18 కోట్ల గ్రాస్) వసూళ్లు చేయాల్సి ఉందని విశ్లేషకులు అంచనా వేశారు.
రికార్డుల దిశగా వసూళ్లు
కే ర్యాంప్ వసూళ్ల పరంగా చూస్తే.. ఈ సినిమా మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఓపెనింగ్ డే నుంచే కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం. ఫస్ట్ డే నెట్‌గా రూ.2.1 కోట్లు, గ్రాస్‌గా రూ.2.8 కోట్ల నుండి రూ.4.5 కోట్ల వరకు వసూలు చేసింది. రెండో రోజు కూడా అదే వేగం కొనసాగి రూ.2. 85 కోట్లు రాబట్టింది. మూడో రోజు కలెక్షన్లు కాస్త తగ్గినా స్థిరంగా నిలిచి రూ.2. 35 కోట్ల వద్ద నిలిచాయి. దీని తర్వాత నాలుగో రోజు రూ.1.85 కోట్లు, ఐదో రోజు రూ.1.3 కోట్లు, ఆరవ రోజు రూ.1 కోటి, ఏడవ రోజు రూ.88 లక్షలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా మొదటి వారం ముగిసే సరికి "కే ర్యాంప్" ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్లు రూ.11.68 కోట్లకు చేరాయి.
వీకెండ్ దుమ్మురేపిన "కే ర్యాంప్"
8వ రోజు శనివారం థియేటర్లలో 26 శాతం ఆక్యుపెన్సీ నమోదై, గ్రాస్ రూ. 1.8 కోట్లు వసూలు చేసింది. 9వ రోజు కూడా అదే స్థాయిలో రూ. 1.8 కోట్లు రాబట్టింది. దీని ఫలితంగా 9 రోజుల్లో ఇండియా వైడ్ గ్రాస్ రూ. 16 కోట్లు చేరినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వరల్డ్‌వైడ్ గ్రాస్ మాత్రం రూ. 23 కోట్లకు చేరినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇక 10వ రోజు సోమవారం వర్కింగ్ డే కావడంతో కలెక్షన్లు స్వల్పంగా తగ్గాయి. 10 రోజు కేవలం రూ. 70 లక్షలు వసూలు చేసింది.
ఇక 11వ రోజు కే ర్యాంప్ కలెక్షన్ల వివరాల్లోకెళ్లే.. మంగళవారం థియేటర్ ఆక్యుపెన్సీ తగ్గింది, ఉదయం షోలు 16%, మధ్యాహ్నం 18%, రాత్రి షోలు కూడా దాదాపు అదే స్థాయిలో కొనసాగాయి. ట్రేడ్ అంచనాల ప్రకారం 11వ రోజు వసూళ్లు రూ 60 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య ఉంటాయని అంచనా. ఈ లెక్కల ప్రకారం మొత్తం 11 రోజుల్లో ఇండియా వైడ్ గ్రాస్ రూ. 17 నుంచి 18 కోట్ల వరకు చేరే అవకాశం ఉంది. వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 25 కోట్ల మార్క్ దాటుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
మూవీ మేకర్స్ లెక్కల ప్రకారం, "కే ర్యాంప్" సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ. 17.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఆ తర్వాత వారం రోజుల్లో, సినిమా రూ. 28 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ చేరినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ లెక్కల ప్రకారం, సినిమా ఇప్పటివరకు కనీసం రూ. 10 కోట్ల నుంచి 12 కోట్ల వరకు లాభం సాధించినట్లు అంచనా. ప్రీ-రిలీజ్ బిజినెస్, థియేట్రికల్ రైట్స్, స్ట్రీమింగ్ డీల్స్ అని నిర్మాతలకు భారీ ప్రాఫిట్స్ అందించాయి. అలాగే.. "కే ర్యాంప్" కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.


Click it and Unblock the Notifications











