K Ramp Day 2 Collections: బాక్సాఫీస్ వద్ద కిరణ్ అబ్బవరం రచ్చ.. కే ర్యాంప్ రెండో రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
K-Ramp Box Office Collection: యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం "కే ర్యాంప్" దీపావళి కానుకగా అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. గత ఏడాది దీపావళికి విడుదలైన "క" సినిమాతో మంచి వసూళ్లు సాధించిన కిరణ్, మరోసారి అదే సీజన్‌లో బరిలోకి దిగడంతో ఈ సినిమాపై పరిశ్రమలో మంచి హైప్ ఏర్పడింది. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ మూవీకి విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్లు, ట్రైలర్లు, సాంగ్స్, ప్రమోషనల్ ఈవెంట్స్ అన్ని కలిపి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో కే ర్యాంప్ మూవీ బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రెండు రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
హాస్య మూవీస్, రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా, శివాజీ బొమ్మక్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తారేజ హీరోయిన్‌గా నటించగా, నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ అందించగా, చోటా కే ప్రసాద్ ఎడిటింగ్, చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. మ్యూజిక్ ఆల్బమ్ ఇప్పటికే యువతలో పాపులర్ అయింది.

బడ్జెట్ & ప్రీ-రిలీజ్ బిజినెస్
ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. నటీనటుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ ఈవెంట్స్, మార్కెటింగ్, థియేట్రికల్ ఖర్చులతో కలిపి "కే ర్యాంప్" మొత్తం బడ్జెట్ రూ. 4 కోట్లు దాటింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి. నైజాం రైట్స్: రూ. 2 కోట్లు, సీడెడ్ రైట్స్: రూ. 1.25 కోట్లు, ఆంధ్రా రైట్స్: రూ. 3 కోట్లు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 0.60 కోట్లు, ఓవర్సీస్ రైట్స్: రూ.1.30 కోట్లు ఇలా మొత్తం కలిపి వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ ₹8.15 కోట్లు జరిగినట్లు సమాచారం. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం ₹9 కోట్లు షేర్, అంటే సుమారు ₹18 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి.
కలెక్షన్స్ జోరు
దీపావళి సందర్బంగా విడుదలైన "కే ర్యాంప్" బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. రిలీజ్‌కు ముందు నుంచే మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా, అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే మంచి రికార్డ్ సాధించింది. ప్రత్యేకంగా అమెరికాలో ప్రీమియర్ షోలకే గట్టి డిమాండ్ ఏర్పడటంతో సినిమా మీద పాజిటివ్ టాక్ మొదలైంది. ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా కూడా "కే ర్యాంప్" దుమ్మురేపింది. సాక్‌నిక్ లెక్కల ప్రకారం, తొలి రోజు నేషనల్ వైడ్‌గా రూ.2.1 కోట్లు నెట్‌గా, రూ.2.8 కోట్లు గ్రాస్‌గా వసూలు చేసింది. ఇక మూవీ మేకర్స్ లెక్కల ప్రకారం, ఫస్ట్ డే కలెక్షన్ రూ.4.5 కోట్లు వరకు చేరినట్లు సమాచారం. ఇలా భారీ ఓపెనింగ్స్‌తో కిరణ్ కెరీర్‌లో మరో క్లీన్ హిట్‌గా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక రెండో రోజు కూడా "కే ర్యాంప్" కలెక్షన్ల జోరు తగ్గేలా లేదు. సాక్‌నిక్ అంచనాల ప్రకారం ఆదివారం ఉదయం షోలలో 29% ఆక్యుపెన్సీ, మధ్యాహ్నం 33% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ట్రెండ్ కొనసాగితే సాయంత్రం, రాత్రి షోల కల్లా మొత్తం రూ.3 కోట్ల వరకు నేషనల్ వైడ్ కలెక్షన్, వరల్డ్ వైడ్‌గా రూ.4.5 నుండి రూ.5 కోట్లు వరకు గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని అంచనా. ఈ లెక్కలను చూస్తే.. రెండు రోజుల్లోనే రూ. 9 కోట్ల నుంచి 10 కోట్ల వరకూ వసూలు చేసే అవకాశముంది.
ఇక దీపావళి సెలవులు, పాజిటివ్ మౌత్ టాక్ సినిమాకు అదనపు బూస్ట్ ఇస్తున్నాయి. కాంతార చాప్టర్ 1, తెలుసు కదా, డ్యూడ్, మిత్రమండలి వంటి చిత్రాల నుంచి గట్టి పోటీ ఉన్నా కూడా, కిరణ్ అబ్బవరం తన సొంత మార్కెట్‌తో "కే ర్యాంప్"ను హిట్ ట్రాక్‌లో నడిపిస్తున్నాడు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, వచ్చే వీకెండ్ వరకు "కే ర్యాంప్" సూపర్ హిట్‌గా నిలిచే అవకాశముందని చెబుతున్నారు. ఈ సక్సెస్‌తో కిరణ్ అబ్బవరం కెరీర్ మరింత బలపడనుంది.


Click it and Unblock the Notifications











