K Ramp Day 5 Collections: కిరణ్ అబ్బవరం ఊచకోత.. కే ర్యాంప్ 5 రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
K-Ramp Box Office Collection: యువ హీరో కిరణ్ అబ్బవరం మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. గత సంవత్సరం దీపావళి సీజన్‌లో విడుదలైన "క" సినిమాతో మంచి విజయం సాధించిన ఈ యువ నటుడు, ఈసారి కూడా అదే టైమ్‌లో ప్రేక్షకుల ముందుకు తన కొత్త చిత్రం "కే ర్యాంప్ (K-Ramp)" తో వచ్చాడు. అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ యాక్షన్-ఎంటర్టైనర్, మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. యంగ్ డైరెక్టర్ జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. ఈ నేపథ్యంలో కే ర్యాంప్ (K-Ramp)మూవీ బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఐదవ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తారేజ హీరోయిన్‌గా నటించింది. ప్రధాన పాత్రల్లో సీనియర్ నటులు నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, శివానీ రాజశేఖర్ వంటి వారు తమదైన నటనతో మెప్పించారు. హాస్య మూవీస్, రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా, శివాజీ బొమ్మక్ కలిసి నిర్మించిన ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ, చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాకు అదనపు బలం ఇచ్చాయి.

ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. 'కే ర్యాంప్' సినిమా బడ్జెట్ సుమారు రూ. 4 కోట్లకు పైగా ఉంది. ఇందులో నటీనటుల పారితోషికాలు, మార్కెటింగ్, ప్రమోషన్, రిలీజ్ ఖర్చులు అన్నీ కలిపి ఉన్నాయి. సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. నైజాం రైట్స్ రూ. 2 కోట్లు, సీడెడ్ రైట్స్ రూ. 1.25 కోట్లు, ఆంధ్రా రైట్స్ రూ. 3 కోట్లు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 0.60 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ. 1.30 కోట్లు. ఇలా మొత్తం థియేట్రికల్ బిజినెస్ రూ. 8.15 కోట్లకు చేరింది. అంటే సినిమా లాభాల బాట పట్టాలంటే కనీసం రూ. 9 కోట్ల షేర్ లేదా సుమారు రూ. 18 కోట్ల గ్రాస్ రాబట్టాలి.
రిలీజ్ రోజు నుంచే అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. దీపావళి సీజన్ అడ్వాంటేజ్‌తో "కే ర్యాంప్" థియేటర్లలో రికార్డ్ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసింది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి పట్టణాల్లో ఫస్ట్ డే షోలు హౌస్‌ఫుల్‌గా నడిచాయి. అమెరికా మరియు ఆస్ట్రేలియా ప్రీమియర్ షోలకూ మంచి రెస్పాన్స్ లభించింది. సాక్‌నిక్ రిపోర్ట్స్ ప్రకారం ఫస్ట్ డే నెట్ కలెక్షన్ రూ. 2.1 కోట్లు, గ్రాస్ కలెక్షన్ రూ. 2.8 కోట్లు కాగా, ప్రొడ్యూసర్‌ల లెక్కల ప్రకారం తొలి రోజు మొత్తం గ్రాస్ రూ. 4.5 కోట్లకు చేరింది. ఇది కిరణ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్‌గా నిలిచింది.
ఇక రెండో రోజు కూడా "కే ర్యాంప్" అదే జోరును కొనసాగించింది. శనివారం నాడు రూ. 2.85 కోట్లు, మూడో రోజు ఆదివారం రూ. 2.35 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ రెండు రోజుల కలిపి రూ. 5 కోట్లకు పైగా వసూళ్లు నమోదు కావడంతో సినిమాకు మరింత పాజిటివ్ బజ్ ఏర్పడింది. అయితే నాలుగవ రోజు (సోమవారం) కలెక్షన్లు కొంచెం తగ్గుముఖం పట్టాయి. సాధారణంగా ఫెస్టివల్ తర్వాత వర్క్‌డేస్‌లో వసూళ్లు తగ్గడం సహజమే.
కానీ "కే ర్యాంప్" విషయంలో తగ్గుదల చాలా తక్కువగా ఉంది. నాలుగవ రోజు (మంగళ వారం) దేశవ్యాప్తంగా రూ. 1.65 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు మూడు రోజుల్లోనే సినిమా రూ. 17.5 కోట్లు గ్రాస్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ సాధించిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అంటే మొదటి వీకెండ్‌లోనే సినిమా ప్రాఫిట్ జోన్‌లోకి అడుగుపెట్టిందని చెప్పొచ్చు. ఈ లెక్కల ప్రకారం "కే ర్యాంప్" కిరణ్ అబ్బవరం కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశం ఉంది.
ఇక ఐదవ రోజు (బుధవారం) కూడా సినిమా కలెక్షన్ల పరంగా అదే జోరును కొనసాగిస్తోంది. సాక్‌నిక్ అంచనాల ప్రకారం బుధవారం ఉదయం షోలలో 21% ఆక్యుపెన్సీ, మధ్యాహ్నం షోలలో 24% ఆక్యుపెన్సీ నమోదైంది. సాయంత్రం, రాత్రి షోల్లో కూడా ఈ ట్రెండ్ కొనసాగితే దేశవ్యాప్తంగా రూ. 1.52 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 2.5 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉంది. మొత్తం ఐదు రోజుల్లో "కే ర్యాంప్" ఇండియా వైడ్ గ్రాస్ రూ. 12 కోట్లు, వర్డల్ వైడ్ రూ. 15 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా. హీరో కిరణ్ అబ్బవరంతోపాటు డైరెక్టర్ జైన్స్ నాని టేకింగ్‌కి ప్రత్యేకంగా ప్రశంసలు లభిస్తున్నాయి. చిన్న బడ్జెట్‌లో కూడా గ్రాండుగా కనిపించేలా సినిమాను తెరకెక్కించాడని ఫిలిం సర్కిల్స్ చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











