K Ramp Day 6 Collections: బ్యాక్సాఫీస్ లో కిరణ్ అబ్బవరం మాస్ రచ్చ.. కే ర్యాంప్ 6 రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
K Ramp Box Office Collection: యువ హీరో కిరణ్ అబ్బవరం మరోసారి తన సత్తా చాటారు. గతంలో 'క'సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు తన తాజా చిత్రం "కే ర్యాంప్"తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా, మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీపావళి సీజన్ అడ్వాంటేజ్‌తో థియేటర్లలో రికార్డ్ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం హౌస్‌ఫుల్ షోలతో దూసుకెళ్తోంది. ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు రెండూ ఈ సినిమాపై మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తుండటంతో "కే ర్యాంప్" కిరణ్ కెరీర్‌లో మరో హిట్‌గా నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో కే ర్యాంప్ మూవీ బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఆరోవ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
యంగ్ డైరెక్టర్ జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తారేజ హీరోయిన్‌గా నటించారు. సీనియర్ నటులు నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్ తమదైన శైలిలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హాస్య మూవీస్, రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా, శివాజీ బొమ్మక్ లు నిర్మించారు. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ చేశారు. టెక్నికల్ వర్గాల పరంగా చూస్తే, ఈ సినిమా అన్ని విభాగాల్లోనూ బాగుందనే చెప్పాలి. చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోశిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ట్రేడ్ సమాచారం ప్రకారం "కే ర్యాంప్" బడ్జెట్ సుమారు రూ.4 కోట్లు. ఇందులో నటీనటుల పారితోషికాలు, ప్రమోషన్లు, మార్కెటింగ్ ఖర్చులు అన్నీ కలిపి ఉన్నాయి. సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ అంచనాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. నైజాం రైట్స్ రూ.2 కోట్లు, సీడెడ్ రైట్స్ రూ.1.25 కోట్లు, ఆంధ్రా రైట్స్ రూ.3 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల రైట్స్ రూ.0.60 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ.1.30 కోట్లు వరకు అమ్ముడైనట్టు సమాచారం. మొత్తం థియేట్రికల్ బిజినెస్ రూ.8.15 కోట్ల వరకు జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లాభాల్లోకి వెళ్లాలంటే కనీసం రూ.9 కోట్ల షేర్, అంటే సుమారు రూ.18 కోట్ల గ్రాస్ రావాల్సి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కలెక్షన్ల సునామీ
కె ర్యాంప్ సినిమా విడుదలైన తొలి రోజే అద్భుతమైన కలెక్షన్లు నమోదు చేసింది. సాక్‌నిక్ రిపోర్ట్స్ ప్రకారం ఫస్ట్ డే నెట్ కలెక్షన్ రూ.2.1 కోట్లు, గ్రాస్ కలెక్షన్ రూ.2.8 కోట్లు కాగా, ప్రొడ్యూసర్ లెక్కల ప్రకారం రూ.4.5 కోట్ల వరకు చేరినట్టు తెలుస్తోంది. రెండో రోజు రూ.2.85 కోట్లు, మూడో రోజు రూ.2.33 కోట్లు, నాలుగో రోజు రూ.1.65 కోట్లు, ఐదో రోజు ఒక కోటి రూపాయల వసూళ్లు సాధించినట్టు సమాచారం. ఈ లెక్కలను బట్టి చూస్తే, ఐదు రోజుల్లోనే సినిమా రూ.12 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించింది.
మూడు రోజుల్లోనే రూ.17.5 కోట్ల కలెక్షన్ రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించిందని నిర్మాతలు ప్రకటించారు. ఆరవ రోజు కూడా "కే ర్యాంప్" కలెక్షన్ల జోరు కొనసాగుతూనే ఉంది. గురువారం ఉదయం షోలలో 21 శాతం ఆక్యుపెన్సీ, మధ్యాహ్నం 22 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. సాయంత్రం షోలలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే రోజుకు మరో కోటి రూపాయల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని సాక్‌నిక్ అంచనా వేసింది. మొత్తం ఆరు రోజుల్లో ఇండియా వైడ్ గ్రాస్ రూ.11.5 కోట్ల నుంచి 12 కోట్ల వరకు ఉండొచ్చని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, బీ & సీ సెంటర్లలో కూడా "కే ర్యాంప్"కు ప్రేక్షకాదరణ పెరుగుతోంది. సిటీలు మాత్రమే కాదు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సినిమా బలమైన వసూళ్లు సాధిస్తోంది. యాక్షన్, ఎమోషన్, కామెడీని సమతూకంగా మేళవించిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ఆకర్షిస్తోంది. ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. మరోసారి కలెక్షన్స్ పుంజుకుంటాయనీ, ఈ వారం చివరినాటికి రూ.20 కోట్ల గ్రాస్ మార్క్ దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే, ఇది కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలుస్తుంది. దాంతో పాటు ఈ విజయంతో కిరణ్ మాస్ హీరోగా తన స్థానం మరింత బలపర్చుకున్నాడనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











