K Ramp Day 8 Collections:బాక్సాఫీస్ వద్ద కిరణ్ దూకుడు.. కే ర్యాంప్ 8వ రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
K Ramp Box Office Collection: టాలీవుడ్‌లో ఎప్పుడూ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసును గెలుచుకునే హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. చిన్న సినిమాలతోనే పెద్ద మార్కెట్‌ను సృష్టించుకున్న ఈ యంగ్ హీరో, తాజాగా విడుదలైన "కే ర్యాంప్" (K Ramp) సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా, మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని హౌస్‌ఫుల్ షోలతో థియేటర్లలో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో కే ర్యాంప్ మూవీ బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 8వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
"కే ర్యాంప్" సినిమాను యువ దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించారు. యాక్షన్, కామెడీ, ఎమోషన్ మేళవింపుతో కొత్త రీతిలో కథను చెప్పడం ఆయన ప్రత్యేకత. సినిమా మొత్తం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగుతూ ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టనివ్వలేదని చెప్పాలి. కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో ఓ జులాయ్ లాగా కనిపించినా, తన యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఆయన సరసన నటించిన యుక్తి తారేజ తన చురుకైన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సీనియర్ నటులు నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్ తమదైన శైలిలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి సినిమాకు బలం చేకూర్చారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి.

ఇక టెక్నికల్ టీమ్ అద్బుతం.. సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి మాసం అద్భుతమైన విజువల్స్‌తో సినిమా లుక్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లారు. ఎడిటర్ చోటా కె. ప్రసాద్ సినిమాకు కావాల్సిన పేస్‌ను అందిస్తూ, ఎక్కడా లాగకుండా సజావుగా నడిపించారు. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందని చెప్పాలి. ప్రత్యేకంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్ సీన్‌లను మరింత ఎలివేట్ చేసింది. పాటలు కూడా యువతరాన్ని ఆకట్టుకుంటున్నాయి.
"కే ర్యాంప్" చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా, శివాజీ బొమ్మక్ లు నిర్మించారు. కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందించబడింది. కానీ దానికి మించిన రేంజ్‌లో స్క్రీన్‌పై కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సినిమా రిలీజ్‌కు ముందు ప్రీ-రిలీజ్ బిజినెస్ అద్భుతంగా జరిగింది. నైజాం రైట్స్ రూ.2 కోట్లు, సీడెడ్ రూ.1.25 కోట్లు, ఆంధ్రా రూ.3 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల రైట్స్ రూ.0.60 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ.1.30 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తం థియేట్రికల్ బిజినెస్ రూ.8.15 కోట్ల వరకు జరిగినట్టు సమాచారం. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, లాభాల్లోకి రావాలంటే కనీసం రూ.9 కోట్ల షేర్, అంటే సుమారు రూ.18 కోట్ల గ్రాస్ రావాల్సి ఉంది.
రికార్డ్ స్థాయి కలెక్షన్లు
"కే ర్యాంప్" విడుదలైన తొలి రోజే అద్భుతమైన కలెక్షన్లు నమోదు చేసింది. ఫస్ట్ డే నెట్ కలెక్షన్ రూ.2.1 కోట్లు కాగా, గ్రాస్ కలెక్షన్ రూ.2.8 కోట్ల నుండి రూ.4.5 కోట్ల వరకు చేరింది. రెండో రోజు రూ.2.85 కోట్లు, మూడో రోజు రూ.2.35 కోట్లు, నాలుగో రోజు రూ.1.85 కోట్లు, ఐదో రోజు రూ.1.3 కోట్లు, ఆరవ రోజు రూ.1 కోటి, ఏడవ రోజు రూ.88 లక్షలు వసూలు చేసింది. ఈ లెక్కల ప్రకారం తొలి వారం మొత్తం ఇండియా వైడ్‌గా రూ.11.68 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. నిర్మాతల ప్రకారం మాత్రం సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.17.5 కోట్ల కలెక్షన్ రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించిందని చెబుతున్నారు.
8వ రోజు కలెక్షన్లలో దూకుడు
8వ రోజు కలెక్షన్లను పరిశీలిస్తే.. వీకెండ్ అడ్వాంటేజ్ కారణంగా మళ్లీ కలెక్షన్లు పెరిగాయి. శుక్రవారం ఉదయం షోలలో 20 శాతం ఆక్యుపెన్సీ నమోదవగా, మధ్యాహ్నం 22 శాతం వరకు పెరిగింది. సాయంత్రం, రాత్రి షోలలో ఆక్యుపెన్సీ మరింతగా పెరిగి అవకాశముంది. దీంతో వసూళ్లు కూడా పెరుగుతాయి. ట్రేడ్ అంచనాల ప్రకారం 8వ రోజు ఇండియావైడ్ గా గ్రాస్ రూ.1 కోట్ల నుండి రూ.1.2 కోట్ల మధ్య వసూలు చేసింది. దీంతో మొత్తం ఎనిమిది రోజుల్లో ఇండియా వైడ్ గ్రాస్ రూ.13 కోట్ల నుండి రూ.13.5 కోట్ల వరకు చేరనున్నది. ప్రపంచవ్యాప్తంగా (Worldwide) రూ.18 నుండి రూ.19 కోట్లు దాటవచ్చని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
చిన్న సినిమా- పెద్ద విజయం
తక్కువ బడ్జెట్‌తో రూపొందిన "కే ర్యాంప్"కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. యాక్షన్, ఎమోషన్, కామెడీ సరిపాళ్లలో ఉండటంతో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆడియెన్స్, మాస్ ఆడియెన్స్ రెండింటినీ ఆకట్టుకోవడంలో దర్శకుడు జైన్స్ నాని సక్సెస్ అయ్యారని విమర్శకులు అంటున్నారు. వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్‌గా ఉండడంతో వీకెండ్ కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రేడ్ అనలిస్టుల అంచనాల ప్రకారం, "కే ర్యాంప్" ఈ వీకెండ్ లో రూ.20 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటే అవకాశం ఉంది. ఇది జరిగితే, కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలువబోతుంది.


Click it and Unblock the Notifications











