K Ramp Day 9 Collections:‌ వీకెండ్‌లో కిరణ్ అబ్బవరం బీభత్సం.. కే ర్యాంప్ 9వ రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?

K Ramp Box Office Collection: టాలీవుడ్‌లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరోసారి తన సత్తా చాటారు. ఎప్పుడూ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్న ఈ యువ హీరో తాజాగా "కే ర్యాంప్ (K Ramp)" సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించారు. అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీపావళి సీజన్‌ అడ్వాంటేజ్, కిరణ్ అబ్బవరం యూత్ ఫాలోయింగ్, స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ కలిసి సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు తెచ్చాయి. ఈ నేపథ్యంలో కే ర్యాంప్ మూవీ బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 9వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

"కే ర్యాంప్" సినిమాను యువ దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం యాక్షన్, కామెడీ, ఎమోషన్ మేళవింపుతో కొత్త తరహాలో సాగింది. ప్రేక్షకులు ఈ సినిమాలో ఎంతో గానో ఆస్వాదిస్తున్నారు. కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తారేజ హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటులు నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్ తమదైన శైలిలో ప్రదర్శన ఇస్తూ సినిమాకు మరింత బలం చేకూర్చారు.

K Ramp Day 9 Expected Box Office Collections Worldwide Kiran Abbavaram s Movie face tough fight from Diwali movies

సినిమాను హాస్య మూవీస్, రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా, శివాజీ బొమ్మక్ లు నిర్మించారు. సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి మాసం చూపించిన విజువల్స్ అద్భుతంగా ఉండగా, ఎడిటర్ చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు పేస్‌ను అందించింది. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి.

బడ్జెట్ & ప్రీ-రిలీజ్ బిజినెస్
ట్రేడ్ సమాచారం ప్రకారం "కే ర్యాంప్" సినిమా మొత్తం రూ.4 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడింది. ఇందులో నటీనటుల పారితోషికాలు, మార్కెటింగ్, ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలిపి ఉన్నాయి. సినిమా విడుదలకు ముందు ప్రీ-రిలీజ్ బిజినెస్ అద్భుతంగా జరిగింది. నైజాం రైట్స్ రూ. 2 కోట్లు, సీడెడ్ రూ. 1.25 కోట్లు, ఆంధ్రా రూ. 3 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల రైట్స్ రూ. 0.60 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ. 1.30 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. మొత్తంగా థియేట్రికల్ బిజినెస్ రూ. 8.15 కోట్ల వరకు జరిగినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. లాభాల్లోకి రావాలంటే కనీసం ₹9 కోట్ల షేర్, అంటే సుమారు ₹18 కోట్ల గ్రాస్ రావాల్సి ఉందని విశ్లేషకులు తెలిపారు.

ఫస్ట్ వీక్ కలెక్షన్లు
కే ర్యాంప్ మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపించింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. ఫస్ట్ డే నెట్ కలెక్షన్ రూ. 2.1 కోట్లు, గ్రాస్ రూ. 2.8 కోట్ల నుంచి ₹4.5 కోట్ల వరకు చేరింది. రెండో రోజు రూ. 2.85 కోట్లు, మూడో రోజు రూ. 2.35 కోట్లు, నాలుగో రోజు రూ. 1.85 కోట్లు, ఐదో రోజు రూ. 1.3 కోట్లు, ఆరవ రోజు రూ. 1 కోటి, ఏడవ రోజు రూ. 88 లక్షలు వసూళ్లు చేసింది. ఈ లెక్కల ప్రకారం, తొలి వారం మొత్తంలో సినిమా ఇండియా వైడ్‌గా రూ. 11.68 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది.

ఎవ్వరూ ఊహించని విధంగా, "కే ర్యాంప్" సినిమా రెండో వారంలో కూడా దూసుకెళ్తోంది. 8వ రోజు శనివారం థియేటర్లలో 23 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. సాయంత్రం, రాత్రి షోలలో పూర్తి హౌస్‌ఫుల్ షోలు కనిపించాయి. దేశవ్యాప్తంగా గ్రాస్ రూ. 3.32 కోట్ల వరకు చేరింది. ఇలా ఇప్పటివరకు 8 రోజుల్లో మొత్తం గ్రాస్ రూ. 16.5 కోట్లకు చేరింది.

9వ రోజు ఆదివారం కూడా కలెక్షన్స్ మరింతగా పెరిగాయి. ఉదయం షోలలో 21 శాతం, మధ్యాహ్నం 24 శాతం ఆక్యుపెన్సీ ఉండగా, రాత్రి షోలలో అది 30 శాతం దాటింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, 9వ రోజు వసూళ్లు రూ. 3 కోట్ల నుంచి రూ. 3.5 కోట్ల మధ్యలో నమోదయ్యాయి. ఈ లెక్కల ప్రకారం, "కే ర్యాంప్" 9 రోజుల్లో ఇండియా వైడ్ గ్రాస్ రూ. 19 నుంచి రూ. 19.5 కోట్లకు చేరే అవకాశం ఉందట. ఇక వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 22 నుంచి రూ. 23 కోట్లు దాచే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనాలున్నాయి.

పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా వీకెండ్‌లో కలెక్షన్లు 35% పెరిగాయి. చిన్న సినిమాగా మొదలై, పెద్ద బ్లాక్‌బస్టర్‌గా మారిన "కే ర్యాంప్" ఇప్పుడు హాలిడే సీజన్‌లో టికెట్ విండోల వద్ద దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే.. మూవీ మేకర్స్ లెక్కల ప్రకారం, "కే ర్యాంప్" సినిమా కేవలం మూడు రోజుల్లోనే ₹17.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఏడు రోజుల్లోనే సినిమా ₹28 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ సాధించినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X