K-Ramp WorldWide Business: కే- ర్యాంప్ ప్రీ రిలీజ్ బిజినెస్... కిరణ్ అబ్బవరం మూవీ లాభాల్లోకి రావాలంటే?

రాజా వారు రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం తదితర చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకుకున్నారు కిరణ్ అబ్బవరం. ఇక గతేడాది దీపావళికి రిలీజైన క సినిమాతో భారీ వసూళ్లు సాధించిన ఆయన ఈ దీపావళికి కే- ర్యాంప్ అనే మూవీతో అదృష్టం పరీక్షించుకోనున్నారు. లవ్, రొమాన్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీపై పరిశ్రమలో హైప్ క్రియేట్ చేసుకుంది. దీనికి తోడు టీజర్లు, ట్రైలర్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలు కిరణ్ అబ్బవరం మూవీపై అంచనాలను పెంచేశాయి. దీపావళి కానుకగా అక్టోబర్ 18వ తేదీన కే ర్యాంప్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో కే ర్యాంప్ మూవీ బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..

హాస్య మూవీస్, రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా, శివాజీ బొమ్మక్‌లు సంయుక్తంగా కే ర్యాంప్ మూవీని నిర్మించారు. ఇందులో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తారేజ హీరోయిన్‌గా నటించారు. నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. కే ర్యాంప్ చిత్రానికి సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రాఫర్‌గా, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించగా.. చైతన్ భరద్వాజ్ సంగీత దర్శకత్వం వహించారు.

K-Ramp Movie Theatrical Business Kiran Abbavaram s Movie Budget and Breakeven target Details

కే ర్యాంప్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతి నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి కే ర్యాంప్ చిత్రానికి దాదాపు 4 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు లోకేషన్లలో ఈ సినిమా షూటింగ్ నిర్వహించారు. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా, ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను నిర్మించారు నిర్మాతలు.

కే ర్యాంప్ ప్రీ రిలీజ్ బిజినెస్
కిరణ్ అబ్బవరం ట్రాక్ రికార్డ్, గతేడాది రిలీజైన క మూవీ వసూళ్ల నేపథ్యంలో కే ర్యాంప్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్‌గా మంచి బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. నైజాం థియేట్రికల్ రైట్స్ 2 కోట్ల రూపాయలు, సీడెడ్‌ థియేట్రికల్ రైట్స్ 1.25 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 3 కోట్ల రూపాయలు చొప్పున ఆంధ్రా, నైజాంలలో 6.25 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే... కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 1.30 కోట్ల రూపాయల చొప్పున మొత్తంగా వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు 8.15 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. కే ర్యాంప్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సీఫీస్ వద్ద 9 కోట్ల రూపాయల షేర్... 18 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

క మూవీతో కలెక్షన్ల వర్షం
గత దీపావళికి క మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం.. భారీ వసూళ్లు అందుకున్నారు. తొలి రోజున 3.5 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టిన క చిత్రం.. తొలి వారం 18.95 కోట్ల రూపాయలు, రెండో వారంలో 6 కోట్ల రూపాయలు, మూడో వారంలో 1.49 కోట్ల రూపాయలు చొప్పున థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఇండియాలో 26.47 కోట్ల రూపాయల నికర వసూళ్లు... 30.67 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో 6.75 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి వరల్డ్ వైడ్‌గా 37.42 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X