900 కోట్లు కొల్లగొట్టిన సినిమాకు సీక్వెల్.. క్లారిటీ ఇచ్చిన RRR రైటర్.. అగ్ర హీరోకు నచ్చడంతో..

ఇండియన్ సినిమా మార్కెట్ పెరుగుతున్న విధానం చూస్తుంటే త్వరలోనే ఇంటర్నేషనల్ లెవెల్లో బిగ్ బడ్జెట్ సినిమాలకు పోటీని ఇవ్వవచ్చని అర్ధమవుతోంది. పదేళ్ల ముందు వరకు కూడా వంద కోట్లు వస్తే అదొక రికార్డు అనుకునేవారు. కానీ ఆ తరువాత ఖాన్ త్రయంతో పాటు బాహుబలి వంటి సినిమా కూడా ఇండియన్ మార్కెట్ ను ప్రపంచం ముందు నిలబెట్టింది. ఇక గతంలో 900కోట్లకు పైగా రికార్డు క్రియేట్ చేసిన ఒక సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. రైటర్ విజయేంద్రప్రసాద్ కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు.

రైటర్ కె.విజయేంద్రప్రసాద్

రైటర్ కె.విజయేంద్రప్రసాద్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలకు దాదాపు అన్నిటికీ కూడా కె.విజయేంద్రప్రసాద్ కథను అందించారు. బాహుబలి రాకముందే ఆయనకి బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు దక్కింది. ముఖ్యంగా 2015లో వచ్చిన భజరంగీ భాయీజాన్ కథ ఏ స్థాయులో క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్

బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్

సల్మాన్ ఖాన్ కెరీర్ ను మరో లెవెల్ కు తీసుకువెళ్లాడమే కాకుండా నటుడిగా కూడా ఆ హీరో మంచి గుర్తింపును అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా అప్పట్లో 969.06కోట్లను వసూలు చేసి ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డును అందుకుంది. సినిమాను సల్మాన్ తన సొంత ప్రొడక్షన్ లో రాక్ లైన్ వెంకటేష్ తో కలిసి 90కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

Recommended Video

Bajrangi Bhaijaan Collections in China
పాకిస్థాన్ లో కూడా బాక్సాఫీస్ హిట్

పాకిస్థాన్ లో కూడా బాక్సాఫీస్ హిట్

కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన భజరంగీ భాయీజాన్ లో సల్మాన్ ఖాన్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. హర్షాలీ మల్హోత్రా చిన్నారి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక కబీర్ ఖాన్ దర్శకత్వ ప్రతిభకు ప్రతీ ఒక్కరు ఫిదా అయ్యారు. రైటర్ విజయేంద్రప్రసాద్ ఆలోచనలకు దర్శకుడు కరెక్ట్ గా రూపాన్ని ఇవ్వడంతో సినిమా పాకిస్థాన్ లో కూడా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది.

భజరంగీ భాయీజాన్ 2.. ఐడియా రెడీ!

భజరంగీ భాయీజాన్ 2.. ఐడియా రెడీ!

రైటర్ విజయేంద్రప్రసాద్ భజరంగీ భాయీజాన్ కథను తెలుగులో పసివాడి ప్రాణం నుంచి ప్రేరణగా పొందినట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక మరోసారి అలాంటి కథను అంధించాడనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు విజయేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు. ఇంకా స్టోరీ మొత్తం సిద్ధం కాలేదట. కానీ ఐడియా మాత్రం ఇప్పటికే సల్మాన్ ఖాన్ కు చేరవేసినట్లు వివరణ ఇచ్చారు. సల్మాన్ కూడా పాయింట్ నచ్చడంతో కథను సిద్ధం చేయమని చెప్పాడట. ప్రస్తుతం ఆ పనిలోనే బిజీగా ఉన్నట్లు వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X