Kaaduvetty Collections హీరోగా మారిన విలన్ సినిమాకు హిట్ టాక్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

తమిళంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మంజల్ స్క్రీన్ బ్యానర్‌పై డీ సుభాష్ చంద్రబోస్ నిర్మాతగా సోలై అరుముగం దర్శకత్వంలో రూపొందిన చిత్రం కడువెట్టి. గతంలో విలన్ పాత్రలతో ఆకట్టుకొన్న ఆర్కే సురేష్ హీరోగా మారి నటించిన ఈ చిత్రంలో సుబ్రమణ్య శివ, ఆడుకాలమ్ మురగదాస్, అధీరా, సంకీర్తన, విస్మయ, తదితరులు నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం తమిళంలో పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తున్నది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కడువెట్టి సినిమా విషయానికి వస్తే.. కుల వివక్ష నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రానికి వనక్కమ్ తమీజా సాధిక్, శ్రీకాంత్ దేవా సంగీత దర్శకత్వం వహించారు. రూరల్ డ్రామా, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీకాంత్ దేవా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. కుల విద్వేషాల కథతో రూపొందిన ఈ సినిమా సుమారుగా 8 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Kaaduvetty Tamil Movie Expected Box Office Collections Worldwide RK Suresh Movie starts good note

తమిళనాడులో ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేయడంతో ఈ సినిమాకు 5 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా వ్యాల్యూ కట్టారు. ఈ సినిమాను తమిళనాడులో సుమారుగా 400 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు తొలి ఆట నుంచి హిట్ టాక్ సొంతం చేసుకొన్నది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ఉండటంతో రానున్న రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Kaaduvetty Tamil Movie Expected Box Office Collections Worldwide RK Suresh Movie starts good note

మార్నింగ్ షో తర్వాత ఈ చిత్రానికి క్రిటిక్స్, జనరల్ ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో మ్యాట్నీ నుంచి ఆక్యుపెన్సీ పెరిగింది. మ్యాట్నీతో పోల్చుకొంటే ఫస్ట్ షోకు మరింత పెరిగింది. అలాగే సెకండ్ షోకు కూడా పాజిటివ్‌గా మారింది. ఈ సినిమా మొత్తంగా 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Kaaduvetty Tamil Movie Expected Box Office Collections Worldwide RK Suresh Movie starts good note

ఇక కడువెట్టి సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు ఈ సినిమాకు పెద్దగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు కాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి కనిపించలేదు. అయితే సానుకూలంగా టాక్ రావడంతో సాయంత్రాని కల్లా కలెక్షన్లు పెరిగాయి. తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే ఈ సినిమా 1.5 కోట్ల గ్రాస్, 80 లక్షలు నికరంగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X