అంచనాలు అందుకోలేదు: రజనీకాంత్ ‘కాలా’ ఫస్ట్ డే కలెక్షన్స్
Recommended Video

భారీ అంచనాలతో విడుదలైన 'కాలా' మూవీ బాక్సాఫీసు వద్ద తొలి రోజు ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేదు. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 45 కోట్ల నుండి రూ. 50 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు 'కబాలి' రికార్డులను బద్దలు కొట్టడంలోనూ 'కాలా' విఫలమైంది. తమిళనాడులో తప్ప మిగతా అన్ని చోట్ల ఈ చిత్రానికి యావరేజ్ రివ్యూలు వచ్చాయి.

‘కబాలి' రికార్డును అందుకోని ‘కాలా'
రజనీకాంత్, పా రంజిత్ దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘కబాలి' తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 87.5 కోట్లు రాబట్టింది. అయితే ఈ మార్కును అందుకోవడంలో ‘కాలా' విఫలైమైంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేక పోవడం గమనార్హం.

ఏ ఏరియాలో ఎంత వసూలైంది?
తమిళనాడులో తొలి రోజు రూ. 17 కోట్లకు పైగా వసూలైనట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్లుపైగా, కేరళలో రూ. 3 కోట్లకుపైగా, రెస్టాఫ్ ఇండియాలో రూ. 6 కోట్ల వరకు వసూలైనట్లు టాక్. ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్ రాలేదు.

చెన్నైలో కాలా సరికొత్త రికార్డ్
అయితే చెన్నై సిటీలో ‘కాలా' తొలిరోజు సరికొత్త రికార్డు నెలకొల్పింది. రూ. 1.76 కోట్లు వసూలు చేయడం ద్వారా అప్పటి వరకు ‘మెర్సల్' పేరు మీద ఉన్న రూ. 1.52 కోట్ల రికార్డ్ బద్దలైంది.

కర్నాటక భారీ దెబ్బ
కర్నాటకలో మొదటి రోజు ‘కాలా' విడుదల కాక పోవడం కూడా వసూళ్లపై ఎఫెక్ట్ పడింది. నేటి నుండి అక్కడ సినిమా విడుదలవుతోంది. అది కూడా మల్టీ ప్లెక్సుల్లో మాత్రమే రిలీజవుతున్నట్లు సమాచారం.

లాభాలు సాధ్యమేనా?
‘కాలా' థియేట్రికల్ రైట్స్ రూ. 155 కోట్ల వరకు అమ్ముడయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లు లాభాలు చూడటం సాధ్యమేనా? అనేది మొదటి వారం గడిస్తే తప్ప చెప్పలేం.


Click it and Unblock the Notifications











