twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్ రిపోర్ట్: తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లకు చుక్కలే.. 'కాలా' కలెక్షన్లపై ఆ ప్రభావం!

    |

    సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా చిత్రం భారీ అంచనాల నడుమ జులై 7 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. తొలి షో నుంచే కాలా చిత్రానికి డివైడ్ టాక్ మొదలైంది. ఆడియన్స్ టాక్ చిత్ర వసూళ్లపై ఎక్కువగా ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. రజినీకాంత్ సినిమా తరహాలో వసూళ్లు రావడం లేదు. ఫలితంగా బయ్యర్లు నష్టపోక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా కాలా కలెక్షన్లు నిరాశ పరిచే విధంగానే ఉన్నాయి. రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

    Recommended Video

    Kaala 1st Day Worldwide Box Office Collection
     అప్పుడు సేఫ్ అయ్యారు

    అప్పుడు సేఫ్ అయ్యారు

    కబాలి చిత్ర దర్శకుడే కాలా చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. కబాలి చిత్రం పరాజయం సాధించినా పా రంజిత్ పై రజినీకాంత్ నమ్మకం ఉంచారు. కబాలి చిత్రంపై ఉన్న అంచనాలు, హైప్ కారణంగా ఓపెనింగ్స్ దుమ్ము దులిపాయి. దీనితో బయ్యర్లు కొంత వరకు సేఫ్ అయ్యారు.

    ఇప్పుడు ప్రభావం చూపింది

    ఇప్పుడు ప్రభావం చూపింది

    కబాలి చిత్ర ప్రభావం కాలా పై పడింది. దీనితో ఓపెనింగ్స్ బాగా తగ్గాయి. వాస్తవానికి కబాలి కంటే కాలా చిత్రమే బావుందని టాక్ ఉంది. కానీ సినిమా చూడడానికి ఆసక్తి చూపడం లేదు.

    నత్త నడకగా

    నత్త నడకగా

    కాలా చిత్రం ఆరు రోజుల్లో 112 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. రజని సత్తాకు ఇది పరీక్షే అని చెప్పొచ్చు. సొంత స్టేట్ తమిళనాడులో కూడా కలెక్షన్స్ ఆశాజనకంగా లేవు.

    తెలుగు రాష్ట్రాల్లో

    తెలుగు రాష్ట్రాల్లో

    కర్ణాటకలో ఈ చిత్రం ఒకరోజు ఆలస్యంగా విడుదలయింది. కావేరి వివాదం రజినీకాంత్ మెడకు చుట్టుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కర్ణాటకలో 8 కోట్లవరకు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఈ చిత్రం 11 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

    బయ్యర్లకు చుక్కలే

    బయ్యర్లకు చుక్కలే

    రెండు తెలుగు రాష్ట్రాల్లో కాలా చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ 30 కోట్లవరకు జరిగినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఫుల్ రన్ లో కనీసం 60 శాతం వసూళ్లు రాబట్టడం కూడా గగనమే. బయ్యర్లు దారుణంగా నష్టపోక తప్పదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

    English summary
    Kaala box office collection Day 6. Telugu state buyers will going to lose huge amount
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X