Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తెలుగు డిస్ట్రిబ్యూటర్‌కు భారీ నష్టాలు మిగిల్చిన ‘కాలా’, ఎంతంటే?
రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాలా' మూవీ తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు మిగిల్చింది. పెట్టుబడిలో సగం కూడా తిరిగి రాలేదు. తెలుగు నాట ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
ఈ చిత్రాన్ని తెలుగులో రూ. 27 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే సినిమా బిజినెస్ పూర్తయ్యే సమయానికి కేవలం రూ. 7 కోట్ల షేర్ మాత్రమే వసూలైంది. దీంతో రజనీకాంత్ తెలుగునాట మూడో ప్లాప్ నమోదు చేశాడు. రజనీ గత చిత్రాలు లింగా, కబాలి చిత్రాలు కూడా ఇక్కడ తీవ్ర నష్టాలు మిగిల్చిన సంగతి తెలిసిందే.
అయితే తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాల్లో 'కాలా' మంచి వసూళ్లు సాధించి పెట్టింది. చెన్నైలో రికార్డు స్థాయి కలెక్షన్ వచ్చింది. అయితే రజనీ గత చిత్రం 'కబాలి'తో పోలిస్తే వసూళ్లు బాగా తగ్గాయని చెప్పక తప్పదు. 2500 థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం జూన్ 7న విడుదలైంది. క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూలు వచ్చినా ఆడియన్స్‌ను థియేటర్ వరకు రప్పించడంలో విఫలమైంది.
ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో చాలా తక్కువ కలెక్షన్స్ నమోదయ్యాయి. 'కబాలి' ఓవర్సీస్లో రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేయగా 'కాలా' బిజినెస్ రూ. 50 కోట్లకు మించలేదు. ఇది ఒక ఐడియలాజికల్ ఫిల్మ్ కావడం, ఎంటర్టెన్మెంట్ తక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.
ఓవరాల్‌గా చూసుకుంటే 'కాలా' చిత్రం నిర్మాతలకు లాభాన్ని తెచ్చి పెట్టింది. వండర్ బార్ ఫిల్మ్స్ బేనర్లో రజనీ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ రూపంలో భారీ లాభాలు ఆర్జించారు. ప్రస్తుతం రజనీ తమిళ యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా ధనుష్ నిర్మిస్తుండటం గమనార్హం.