twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు డిస్ట్రిబ్యూటర్‌కు భారీ నష్టాలు మిగిల్చిన ‘కాలా’, ఎంతంటే?

    By Bojja Kumar
    |

    రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాలా' మూవీ తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు మిగిల్చింది. పెట్టుబడిలో సగం కూడా తిరిగి రాలేదు. తెలుగు నాట ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

    ఈ చిత్రాన్ని తెలుగులో రూ. 27 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే సినిమా బిజినెస్ పూర్తయ్యే సమయానికి కేవలం రూ. 7 కోట్ల షేర్ మాత్రమే వసూలైంది. దీంతో రజనీకాంత్ తెలుగునాట మూడో ప్లాప్ నమోదు చేశాడు. రజనీ గత చిత్రాలు లింగా, కబాలి చిత్రాలు కూడా ఇక్కడ తీవ్ర నష్టాలు మిగిల్చిన సంగతి తెలిసిందే.

    kaala

    అయితే తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాల్లో 'కాలా' మంచి వసూళ్లు సాధించి పెట్టింది. చెన్నైలో రికార్డు స్థాయి కలెక్షన్ వచ్చింది. అయితే రజనీ గత చిత్రం 'కబాలి'తో పోలిస్తే వసూళ్లు బాగా తగ్గాయని చెప్పక తప్పదు. 2500 థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం జూన్ 7న విడుదలైంది. క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూలు వచ్చినా ఆడియన్స్‌ను థియేటర్ వరకు రప్పించడంలో విఫలమైంది.

    ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో చాలా తక్కువ కలెక్షన్స్ నమోదయ్యాయి. 'కబాలి' ఓవర్సీస్‌లో రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేయగా 'కాలా' బిజినెస్ రూ. 50 కోట్లకు మించలేదు. ఇది ఒక ఐడియలాజికల్ ఫిల్మ్ కావడం, ఎంటర్టెన్మెంట్ తక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.

    ఓవరాల్‌గా చూసుకుంటే 'కాలా' చిత్రం నిర్మాతలకు లాభాన్ని తెచ్చి పెట్టింది. వండర్ బార్ ఫిల్మ్స్ బేనర్లో రజనీ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ రూపంలో భారీ లాభాలు ఆర్జించారు. ప్రస్తుతం రజనీ తమిళ యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా ధనుష్ నిర్మిస్తుండటం గమనార్హం.

    English summary
    As expected, Super Star Rajinikanth's Kaala emerged as a big disaster in Telugu film industry. The film's final run is completed and the movie has witnessed a distributor share of 7 Cr.Kabali and Lingaa collected more money than Kaala in the final run. Kaala's theatrical rights in Telugu are valued for 27 Cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X