‘కాలా’ యూఎస్ఏ కలెక్షన్స్.... ‘కబాలి’ రికార్డు బద్దలు కొట్టడంలో ఫెయిల్!
Recommended Video

రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'కాలా' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అభిమానులు ఈ చిత్రం విడుదలతో పండగ మూడ్లోకి వెళ్లిపోయారు. ఇండియాకంటే ముందుగా యూఎస్ఏలో ప్రీమియర్ షోలు ప్రదర్శితం అవ్వడం, పాజిటివ్ టాక్ రావడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. చెన్నైలో తెల్లవారు ఝామున బెనిఫిట్ షోల ప్రదర్శన తర్వాత 'కాలా' సూపర్ హిట్ అని తేలిపోయింది. 'కబాలి' కంటే 'కాలా' మరింత బెటర్‌గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కాలా యూఎస్ఏ ప్రీమియర్ షో కలెక్షన్స్
రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని యూఎస్ఏలో దాదాపు 300 లొకేషన్లలో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రీమియర్స్ ద్వారా $451,000 వసూలైనట్లు తెలుస్తోంది. యూఎస్ఏలో ఫస్ట్ డే పూర్తయ్యే సమయానికి వసూళ్లు 1 మిలియన్ డాలర్ మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

ఆసక్తి చూపని ప్రవాస భారతీయులు
రజనీకాంత్ గత చిత్రాలు పెద్దగా ఆడక పోవడం, ప్రమోషన్లు పెద్దగా నిర్వహించక పోవడంతో ‘కాలా' చిత్రాన్ని చూడటానికి ప్రవాస భారతీయులు పెద్దగా ఆసక్తి చూపలేదని ప్రీమియర్ షోల కలెక్షన్లు చూస్తే స్పష్టమవుతోంది.

కబాలి రికార్డులు బద్దలు కొట్టడంలో ఫెయిల్
రజనీకాంత్, పా రంజిత్ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం ‘కబాలి' యూఎస్ఏ ప్రీమియర్ షోల ద్వారా $ 1,925,379 వసూలు చేసింది. ఈ కార్డును బద్దలు కొట్టడంలో ‘కాలా' దారుణంగా విఫలమైంది. అందులో సగం కూడా వసూలు చేయలేక పోయింది.

కాలా
రజనీకాంత్‌తో పాటు ప్రముఖ హిందీ నటుడు నానా పాటేకర్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ముంబై మురికివాడ ధారావి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ధారావి డాన్ పాత్రలో రజనీకాంత్, రాజకీయ నాయకుడి పాత్రలో నానా పాటేకర్ నటించారు. బాలీవుడ్ నటి హుమా ఖురేషి ముఖ్యపాత్ర పోషిస్తోంది. కబాలి తర్వాత దర్శకుడు పా రంజిత్‌తో రజనీకాంత్ చేసిన రెండవ సినిమా ఇది. వండర్ బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











