Kaantha Closing Collection: కాంత క్లోజింగ్ కలెక్షన్స్.. దుల్కర్ సల్మాన్ మూవీకి లాభమెంత? నష్టమెంత?

స్పిరిట్ మీడియా, వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, ప్రశాంత్ పొట్లూరి, జామ్ వర్గీస్‌‌లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం కాంత. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేలు జంటగా నటించారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. సముద్రఖని, రానా దగ్గుబాటి, రవింద్ర విజయ్, నిళ్‌గల్ రవి, భగవతి పెరుమాళ్, బిజేష్ నగేష్‌ తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తమిజ్ ప్రభ ఈ చిత్రానికి కథను అందించగా.. లీవెల్లన్ అంటోనీ, గాన్‌సెల్వజ్‌లు ఎడిటింగ్.. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం.. జాను చంథర్ స్వరాలు సమకూర్చారు. డానీ సాన్‌చెజ్ లోపెజ్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. బాలల దినోత్సవం కానుకగా నవంబర్ 14న కాంత ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత? లాభమెంత? నష్టమెంత? ఈ వివరాల్లోకి వెళితే...

కాంత బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలకు అయిన ఖర్చులను కలిపి కాంత మూవీకి దాదాపు 80 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. దుల్కర్ సల్మాన్ ట్రాక్ రికార్డ్, టీజర్, ట్రైలర్ల కారణంగా కాంత సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయి... సాలీడ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడానికి దోహదం చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దాంతో కాంత మూవీకి వరల్డ్ వైడ్‌గా 28 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దుల్కర్ సల్మాన్ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 29 కోట్ల రూపాయల షేర్, 58 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. కాంత చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా దాదాపు 3000 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

Kaantha Box Office Closing Collections Worldwide How much loss or profit for Dulquer Salmaan s Movie

కాంత మూవీ కలెక్షన్స్
కాంత సినిమాకు ఇండియా వైడ్‌గా తొలి రోజున 4.35 కోట్ల రూపాయలు, రెండో రోజున 5 కోట్ల రూపాయలు, మూడో రోజున 4.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.80 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.85 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.64 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.5 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 30 లక్షల రూపాయలు, తొమ్మిదవ రోజున 52 లక్షల రూపాయలు, పదో రోజున 48 లక్షల రూపాయలు, పదకొండో రోజున 20 లక్షల రూపాయలు, పన్నెండవ రోజున 15 లక్షల రూపాయలు, పదమూడో రోజున 14 లక్షల రూపాయలు, పద్నాలుగో రోజున 10 లక్షల రూపాయలు చొప్పున ఇండియాలో 22.48 కోట్ల రూపాయల నికర వసూళ్లు... 26.56 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్, 18 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది కాంత.

తెలుగు రాష్ట్రాల్లో కాంత కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 1.7 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.6 కోట్ల రూపాయలు, మూడో రోజున 1.4 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 50 లక్షల రూపాయలు, ఐదో రోజున 50 లక్షల రూపాయలు, ఆరో రోజున 52 లక్షల రూపాయలు, ఏడో రోజున 45 లక్షల రూపాయలు, ఎనిమిదవ రోజున 2 లక్షల రూపాయలు, తొమ్మిదవ రోజున 2 లక్షల రూపాయలు, పదో రోజున 5 లక్షల రూపాయలు, పదకొండో రోజున లక్షల రూపాయలు, పన్నెండవ రోజున 3 లక్షల రూపాయలు, పదమూడో రోజున 3 లక్షల రూపాయలు, పద్నాలుగో రోజున 2 లక్షల రూపాయలు చొప్పున 6.8 కోట్ల రూపాయలు రాబట్టింది.

కాంత ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలో దుల్కర్ సల్మాన్ సినిమాలకు తొలి నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలోనే కాంత కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో దుల్కర్ - భాగ్యశ్రీల మూవీకి 8.45 కోట్ల రూపాయలు వసూలు చేసింది కాంత. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి ఇప్పటి వరకు కాంత మూవీకి వరల్డ్ వైడ్‌గా 35 కోట్ల రూపాయలు రాబట్టింది. కాంతకు కర్ణాటకలో 3 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 7.15 కోట్ల రూపాయలు, తమిళనాడులో 12 కోట్ల రూపాయలు, కేరళలో 5 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 65 లక్షల, కర్ణాటకలో 3 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది.

కాంతకు లాభమెంత? నష్టమెంత?
హీరోగా, నిర్మాతగా దూసుకెళ్తున్న దుల్కర్ సల్మాన్‌ దూకుడుకు కాంత బ్రేక్ వేసిందని చెప్పొచ్చు. ఈ సినిమా ఏ మార్కెట్‌లోనూ బ్రేక్ ఈవెన్ కాలేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 29 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్‌కు గాను 18 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసి షేర్ పరంగా దాదాపు 11 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. అలాగే 58 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉండగా.. 35 కోట్లు మాత్రమే వసూలు చేసి ఓవరాల్‌గా 23 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చాడు దుల్కర్ సల్మాన్.

నిర్మాతలు ఈ చిత్రం కోసం దాదాపు 80 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించగా.. 35 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసి, కేవలం 45 శాతం బడ్జెట్‌ను మాత్రమే రికవరీ చేయగలిగింది. అయితే డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, ఆడియో హక్కుల ద్వారా నిర్మాతలు స్వల్ప నష్టాలతో బయటపడినట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X