Kaantha Day 1 Collections: కాంతకు రికార్డ్ ఓపెనింగ్స్... దుల్కర్ సల్మాన్ మూవీకి తొలి రోజు ఎన్ని కోట్లంటే?

స్పిరిట్ మీడియా, వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, ప్రశాంత్ పొట్లూరి, జామ్ వర్గీస్‌‌లు నిర్మించిన చిత్రం కాంత. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. కాంత చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. సముద్రఖని, రానా దగ్గుబాటి, రవింద్ర విజయ్, నిళ్‌గల్ రవి, భగవతి పెరుమాళ్, బిజేష్ నగేష్‌లు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమిజ్ ప్రభ ఈ చిత్రానికి కథను అందించారు. లీవెల్లన్ అంటోనీ, గాన్‌సెల్వజ్‌లు ఎడిటింగ్.. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం.. జాను చంథర్ స్వరాలు సమకూర్చారు. డానీ సాన్‌చెజ్ లోపెజ్‌ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించారు.

ఇటీవలే లోక చాప్టర్ 1 : చంద్రతో నిర్మాతగా భారీ లాభాలను అందుకున్న దుల్కర్ సల్మాన్ తాజాగా కాంత చిత్రానికి సహ నిర్మాతా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కాంత సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలల దినోత్సవం కానుకగా నవంబర్ 14న కాంత చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

Kaantha Day 1 expected Box Office Collections Worldwide Dulquer Salmaan movie good start at GBOC

కాంత బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలకు అయిన ఖర్చులను కలిపి కాంత మూవీకి దాదాపు 80 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సురేష్, తమిళంలో ఏజీఎస్, మలయాళంలో స్వయంగా దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో హీరో రానానే స్వయంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం విశేషం. కాంత మూవీకి సినిమా థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగింది? అనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. అయితే కాంత మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద ఏకంగా 105 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఈ మూవీపై ఉన్న అంచనాల నేపథ్యంలో కాంతను వరల్డ్ వైడ్‌గా దాదాపు 3000 స్క్రీన్‌లలో విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.

కాంత మూవీ ఓవర్సీస్ కలెక్షన్స్:
రిలీజ్‌కు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నార్త్ అమెరికాలో దుల్కర్ సల్మాన్ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్‌లో జరిగింది. నవంబర్ 13వ తేదీన ఈ చిత్రానికి ప్రీమియర్స్ ప్రదర్శించగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అమెరికాలో 116 లోకేషన్స్‌లో 268 షోలకు గాను 1258 టికెట్లు అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం కాంత చిత్రానికి నార్త్ అమెరికాలో 18931 డాలర్లు (భారత కరెన్సీలో 16.80 లక్షల రూపాయలు) వచ్చినట్లుగా నివేదికలు చెబుతున్నారు. ఇందులో తెలుగు వెర్షన్‌కు 13203 డాలర్లు (11.71 లక్షల రూపాయలు), తమిళ వెర్షన్‌కు 5278 డాలర్లు ( 5.08 లక్షల రూపాయలు) వసూలైనట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

కాంత తొలి రోజు వసూళ్లు
దుల్కర్ సల్మాన్ ట్రాక్ రికార్డ్‌ కారణంగా తొలి రోజు కాంత సినిమా సాలీడ్ నెంబర్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తొలిరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కాంత తమిళ వెర్షెన్‌కు 15 శాతం, తెలుగు వెర్షన్‌కు 17 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. ప్రీమియర్స్ + అడ్వాన్స్ బుకింగ్ కలిపి కాంత చిత్రానికి తొలి రోజున భారీ ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రూపాయలు, మలయాళంలో 4 కోట్ల రూపాయలు, తమిళంలో 2 కోట్ల రూపాయలు, కర్ణాటక+ హిందీ + రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్ మార్కెట్‌లో 2 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా ఈ మూవీకి 12 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X