Kaantha Day 2 Collections: కాంత బాక్సాఫీస్ కలెక్షన్స్.. దుల్కర్ సల్మాన్ మూవీకి రెండో రోజు ఎన్ని కోట్లంటే?

తమిళ చిత్ర పరిశ్రమలో తొలి సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎంకే. త్యాగరాజ భాగవతార్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం కాంత. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. స్పిరిట్ మీడియా, వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, ప్రశాంత్ పొట్లూరి, జామ్ వర్గీస్‌‌లు నిర్మించిన చిత్రం కాంత. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. సముద్రఖని, రానా దగ్గుబాటి, రవింద్ర విజయ్, నిళ్‌గల్ రవి, భగవతి పెరుమాళ్, బిజేష్ నగేష్‌లు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమిజ్ ప్రభ ఈ చిత్రానికి కథను అందించారు. లీవెల్లన్ అంటోనీ, గాన్‌సెల్వజ్‌లు ఎడిటింగ్.. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం.. జాను చంథర్ స్వరాలు సమకూర్చారు. డానీ సాన్‌చెజ్ లోపెజ్‌ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించారు. బాలల దినోత్సవం కానుకగా నవంబర్ 14న కాంత చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

కాంత బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలకు అయిన ఖర్చులను కలిపి కాంత మూవీకి దాదాపు 80 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సురేష్, తమిళంలో ఏజీఎస్, మలయాళంలో స్వయంగా దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో హీరో రానానే స్వయంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం విశేషం. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద ఏకంగా 105 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. కాంత చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా దాదాపు 3000 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

Kaantha Day 2 expected Box Office Collections Worldwide Dulquer Salmaan s movie performing very well at GBOC

కాంత మూవీ తొలిరోజు కలెక్షన్స్:
కాంత సినిమాకు తొలి రోజున వరల్డ్ వైడ్‌గా 10.4 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. ఇండియాలో తొలి రోజున ప్రీమియర్స్‌తో కలిపి 4.3 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్ వచ్చాయి. కర్ణాటకలో 40 లక్షల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 1.65 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.85 కోట్ల రూపాయలు, కేరళలలో 1.1 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 10 లక్షల రూపాయలు చొప్పున తొలి రోజున కాంత మూవీకి ఇండియా వైడ్‌గా 5.1 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.

కాంత ఓవర్సీస్ కలెక్షన్స్
దుల్కర్ సల్మాన్ మూవీకి ఓవర్సీస్‌లో మంచి ఫ్యాన్ బేస్ ఉండటంతో కాంతకు అడ్వాన్స్ బుకింగ్‌‌లో వసూళ్లు బాగున్నాయి. ప్రీమియర్స్‌తో కాంతారకు 40K డాలర్లు (భారత కరెన్సీలో 35.47 లక్షల రూపాయలు) వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక గల్ఫ్, మిడిల్ ఈస్ట్, యూకే, యూరప్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలలో కాంతకు 4 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఓవరాల్‌గా ఓవర్సీస్‌లో తొలి రోజున కాంతకు 5 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చినట్లుగా నివేదికలు చెబుతున్నాయి.

కాంత రెండో రోజు వసూళ్లు
పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో పాటు వీకెండ్ కావడంతో కాంతకు రెండో రోజు సాలీడ్ బుకింగ్స్ జరుగుతున్నాయి. రెండో రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కాంత తమిళ వెర్షెన్‌కు 16 శాతం, తెలుగు వెర్షన్‌కు 13 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. దాంతో రెండో రోజున కాంత సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు, మలయాళంలో 3 కోట్ల రూపాయలు, తమిళంలో 2 కోట్ల రూపాయలు, కర్ణాటక+ హిందీ + రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్ మార్కెట్‌లో కోటి రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా ఈ మూవీకి 10 కోట్ల రూపాయల రేంజ్‌లో వసూళ్లు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X