Kaantha Day 3 Collections: మిక్స్‌డ్ టాక్‌లోనూ కాంత హవా.. దుల్కర్ మూవీకి మూడో రోజు ఎన్ని కోట్లంటే?
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన చిత్రం కాంత. స్పిరిట్ మీడియా, వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, ప్రశాంత్ పొట్లూరి, జామ్ వర్గీస్‌లు నిర్మాతలుగా వ్యవహరించారు. సముద్రఖని, రానా దగ్గుబాటి, రవింద్ర విజయ్, నిళ్‌గల్ రవి, భగవతి పెరుమాళ్, బిజేష్ నగేష్‌లు కాంత చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. తమిజ్ ప్రభ ఈ చిత్రానికి కథను అందించారు. లీవెల్లన్ అంటోనీ, గాన్‌సెల్వజ్‌లు ఎడిటింగ్.. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం.. జాను చంథర్ స్వరాలు సమకూర్చారు. డానీ సాన్‌చెజ్ లోపెజ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. బాలల దినోత్సవం కానుకగా నవంబర్ 14న కాంత చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మూడో రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
కాంత బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలకు అయిన ఖర్చులను కలిపి కాంత మూవీకి దాదాపు 80 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సురేష్, తమిళంలో ఏజీఎస్, మలయాళంలో స్వయంగా దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో హీరో రానానే స్వయంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం విశేషం. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద ఏకంగా 105 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. కాంత చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా దాదాపు 3000 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

కాంత మూవీ రెండు రోజుల కలెక్షన్స్:
కాంత సినిమాకు ఇండియా వైడ్‌గా తొలి రోజున 4.35 కోట్ల రూపాయలు, రెండో రోజున 4.85 కోట్ల రూపాయలు చొప్పున 9.2 కోట్ల రూపాయల నెట్.. 10.9 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సాక్‌నిక్ తెలిపింది. కర్ణాటకలో 90 లక్షల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 3.60 కోట్ల రూపాయలు, తమిళనాడులో 4.10 కోట్ల రూపాయలు, కేరళలలో 2.14 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 20 లక్షల రూపాయలు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 1.7 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.6 కోట్ల రూపాయలు వసూలు చేసింది కాంత. నైజాంలో 88 లక్షల రూపాయలు, సీడెడ్‌లో 12 లక్షల రూపాయలు, ఆంధ్రలో 93 లక్షల రూపాయల చొప్పున దుల్కర్ సల్మాన్ మూవీ షేర్ రాబట్టింది.
కాంత ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో కాంత సినిమాకు సాలీడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రీమియర్స్‌లో 40K డాలర్లు (35.47 లక్షల రూపాయలు), రెండో రోజైన శనివారం సాయంత్రం 7 గంటలకు 43K (భారత కరెన్సీలో 38.13 లక్షల రూపాయలు) రాబట్టాడు దుల్కర్ సల్మాన్. ట్రేడ్ పండితులు చెబుతున్న దానిని బట్టి నార్త్ అమెరికాలో ఈ వీకెండ్ ముగిసేనాటికి కాంత చిత్రం 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో అడుగుపెడుతుందట. నార్త్ అమెరికాను మినహాయిస్తే... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలతో కలిపి కాంత మూవీకి ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ + ఓవర్సీస్ వసూళ్లతో కలిపి కాంత మూవీకి రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 14 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.
కాంత మూడో రోజు వసూళ్లు
మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ వీకెండ్ కావడంతో దుల్కర్ సల్మాన్ - భాగ్యశ్రీల సినిమాకు బాగానే బుకింగ్స్ జరుగుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. గర్ల్‌ఫ్రెండ్ థియేట్రికల్ రన్ ముగింపుకు చేరుకోవడంతో పాటు ఇటీవల విడుదలైన సినిమాలు అంతగా ప్రభావం చూపించకపోవడంతో కాంతకు కలిసొస్తోంది. దాంతో మూడో రోజున కాంత సినిమాకు మధ్యాహ్నం 3 గంటల వరకు తమిళ వెర్షన్‌లో 17 శాతం, తెలుగు వెర్షన్‌లో 13 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు, మలయాళంలో 2 కోట్ల రూపాయలు, తమిళంలో 3 కోట్ల రూపాయలు, కర్ణాటక+ హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్ మార్కెట్‌లో 50 లక్షల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా ఈ మూవీకి 8 కోట్ల రూపాయల రేంజ్‌లో వసూళ్లు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











