Kaantha Day 5 Collections: పడిపోయిన కాంత కలెక్షన్స్.. దుల్కర్ సల్మాన్ మూవీకి 5వ రోజు ఎన్ని కోట్లంటే?

తమిళ చిత్ర పరిశ్రమలో తొలి సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎంకే త్యాగరాజ భాగవతార్ జీవితంలోని ముఖ్యమైన ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం కాంత. తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించారు. స్పిరిట్ మీడియా, వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, ప్రశాంత్ పొట్లూరి, జామ్ వర్గీస్‌‌లు నిర్మాతలుగా వ్యవహరించారు. సముద్రఖని, రానా దగ్గుబాటి, రవింద్ర విజయ్, నిళ్‌గల్ రవి, భగవతి పెరుమాళ్, బిజేష్ నగేష్‌లు కాంత సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

తమిజ్ ప్రభ ఈ చిత్రానికి కథను అందించారు. లీవెల్లన్ అంటోనీ, గాన్‌సెల్వజ్‌లు ఎడిటింగ్.. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం.. జాను చంథర్ స్వరాలు సమకూర్చారు. డానీ సాన్‌చెజ్ లోపెజ్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. బాలల దినోత్సవం కానుకగా నవంబర్ 14న కాంత చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఐదో రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

Kaantha Day 5 expected Box Office Collections Worldwide Dulquer Salmaan s movie facing a tough time

కాంత బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలకు అయిన ఖర్చులను కలిపి కాంత మూవీకి దాదాపు 80 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సురేష్, తమిళంలో ఏజీఎస్, మలయాళంలో స్వయంగా దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో హీరో రానానే స్వయంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం విశేషం. దుల్కర్ సల్మాన్ క్రేజ్, టీజర్, ట్రైలర్ల కారణంగా కాంత సినిమాకు మంచి బిజినెస్ జరిగినట్లుగా సినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా 28 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దాంతో కాంత చిత్రం లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 29 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. కాంత చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా దాదాపు 3000 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

కాంత మూవీ నాలుగు రోజుల కలెక్షన్స్:
కాంత సినిమాకు ఇండియా వైడ్‌గా తొలి రోజున 4.35 కోట్ల రూపాయలు, రెండో రోజున 5 కోట్ల రూపాయలు, మూడో రోజున 4.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.39 కోట్ల చొప్పున వసూలు చేసింది. దాంతో ఇండియా వైడ్‌గా ఇప్పటి వరకు 15.65 కోట్ల రూపాయల నికర వసూళ్లు... 18.45 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. గడిచిన నాలుగు రోజుల్లో కర్ణాటకలో 1.73 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 5.15 కోట్ల రూపాయలు, తమిళనాడులో 10.45 కోట్ల రూపాయలు, కేరళలలో 3.6 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 42 లక్షల రూపాయలు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 1.7 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.6 కోట్ల రూపాయలు, మూడో రోజున 1.4 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 50 లక్షల రూపాయలు వసూలు చేసింది కాంత. నాలుగు రోజుల్లో నైజాంలో 1.32 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 20 లక్షల రూపాయలు, ఆంధ్రలో 1.30 కోట్ల రూపాయల చొప్పున దుల్కర్ సల్మాన్ మూవీ షేర్ రాబట్టింది.

కాంత ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో కాంత సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 168K డాలర్లు (భారత కరెన్సీలో 1.48 కోట్ల రూపాయలు) రాబట్టగా.. సోమవారం నాటి లెక్కలతో కలిపి ఇది 185K (1.63 కోట్ల రూపాయలు) చొప్పున వసూళ్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. నార్త్ అమెరికాతో పాటు మిగిలిన దేశాలతో కలిపి కాంత చిత్రానికి ఓవరాల్‌గా ఓవర్సీస్ నుంచి 8.50 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ + ఓవర్సీస్ వసూళ్లతో కలిపి కాంత మూవీకి రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 27 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

కాంత ఐదో రోజు వసూళ్లు
వీకెండ్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముగించిన కాంత చిత్రం.. వర్కింగ్ డేస్‌లో స్లో అయ్యింది. ఐదో రోజు ఈ సినిమాకు సాయంత్రం 5 గంటల వరకు తమిళంలో 15 శాతం, తెలుగులో 11 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఐదవ రోజు కాంత మూవీకి వరల్డ్ వైడ్‌గా 1.50 నుంచి 2 కోట్ల రూపాయల మధ్యలో కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X