Kaantha Day 7 Collections: నష్టాల్లోనే కాంత.. దుల్కర్ సల్మాన్ మూవీకి ఇంకెంత రావాలంటే?
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా సెల్వమణి సెల్వరాజ్ నటించిన చిత్రం కాంత. స్పిరిట్ మీడియా, వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, ప్రశాంత్ పొట్లూరి, జామ్ వర్గీస్‌లు నిర్మాతలుగా వ్యవహరించారు. కాంతలో సముద్రఖని, రానా దగ్గుబాటి, రవింద్ర విజయ్, నిళ్‌గల్ రవి, భగవతి పెరుమాళ్, బిజేష్ నగేష్ తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తమిజ్ ప్రభ ఈ చిత్రానికి కథను అందించగా.. లీవెల్లన్ అంటోనీ, గాన్‌సెల్వజ్‌లు ఎడిటింగ్.. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం.. జాను చంథర్ స్వరాలు సమకూర్చారు. డానీ సాన్‌చెజ్ లోపెజ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. నవంబర్ 14న కాంత ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఏడో రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
కాంత బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలకు అయిన ఖర్చులను కలిపి కాంత మూవీకి దాదాపు 80 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సురేష్, తమిళంలో ఏజీఎస్, మలయాళంలో స్వయంగా దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో హీరో రానానే స్వయంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం విశేషం. దుల్కర్ సల్మాన్ క్రేజ్, టీజర్, ట్రైలర్ల కారణంగా కాంత సినిమాకు మంచి బిజినెస్ జరిగినట్లుగా సినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా 28 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దాంతో కాంత చిత్రం లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 29 కోట్ల రూపాయల షేర్, 58 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. కాంత చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా దాదాపు 3000 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

కాంత మూవీ ఆరు రోజుల కలెక్షన్స్:
కాంత సినిమాకు ఇండియా వైడ్‌గా తొలి రోజున 4.35 కోట్ల రూపాయలు, రెండో రోజున 5 కోట్ల రూపాయలు, మూడో రోజున 4.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.80 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.85 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.64 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 19.14 కోట్ల రూపాయల నెట్... 20.65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. గడిచిన ఆరు రోజుల్లో కర్ణాటకలో 2.15 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 6.22 కోట్ల రూపాయలు, తమిళనాడులో 11 కోట్ల రూపాయలు, కేరళలలో 3.6 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 55 లక్షల రూపాయలు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 1.7 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.6 కోట్ల రూపాయలు, మూడో రోజున 1.4 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 50 లక్షల రూపాయలు, ఐదో రోజున 50 లక్షల రూపాయలు, ఆరో రోజున 52 లక్షల రూపాయలు వసూలు చేసింది కాంత. ఆరు రోజుల్లో నైజాంలో 1.48 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 25 లక్షల రూపాయలు, ఆంధ్రలో 1.47 కోట్ల రూపాయల చొప్పున దుల్కర్ సల్మాన్ మూవీ షేర్ రాబట్టింది.
కాంత ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో కాంత చిత్రానికి తొలి నుంచి వసూళ్లు బాగానే వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మంగళవారం సాయంత్రం 7 గంటల వరకు కాంత చిత్రానికి నార్త్ అమెరికాలో 194K డాలర్లు (భారత కరెన్సీలో 1.72 కోట్ల రూపాయలు) వచ్చాయి. అయితే ఆరో రోజు వరకు నార్త్ అమెరికాలో ఈ మొత్తం 2 కోట్ల రూపాయలు దాటి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మిగిలిన దేశాలలో కాంతకు 6 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో దుల్కర్ సల్మాన్ మూవీకి 8 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు కాంత మూవీకి వరల్డ్ వైడ్‌గా 29 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైనట్లు సాక్‌నిక్ తెలిపింది.
కాంత ఏడో రోజు వసూళ్లు
వర్కింగ్ డేస్‌లోనూ కాంత మూవీ సాలీడ్ బుకింగ్స్ నమోదు చేసింది. అర్బన్ ఏరియాలలో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఏడో రోజు కాంత చిత్రానికి సాయంత్రం 4 గంటల వరకు తమిళంలో 13 శాతం, తెలుగులో 10 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. ఏడో రోజు కాంత మూవీకి వరల్డ్ వైడ్‌గా 1.50 నుంచి 2 కోట్ల రూపాయల మధ్యలో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద మరో 28 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నవంబర్ 21న కొత్త సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో వాటి రిజల్ట్‌ని బట్టి కాంత థియేట్రికల్ రన్ ఆధారపడి ఉంది.


Click it and Unblock the Notifications











