Kaantha Business: కాంత బడ్జెట్ ఎంత? దుల్కర్, రానా మూవీకి ఎన్ని కోట్లు వస్తే లాభాల్లోకి అంటే?
దక్షిణాదిలో స్టార్ హీరోలు రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా స్పిరిట్ మీడియా, వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్లపై రూపొందుతున్న చిత్రం కాంత. తమిళ సినిమా పరిశ్రమంలో ఎంకే త్యాగరాజ భాగవతార్, ఎంజీఆర్, ఎంఆర్ రాధా లాంటి సినీ లెజెండ్స్ జీవితాలల్ో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన చిత్రంలో దుల్కర్, సముద్రఖని, భాగ్యశ్రీ భోర్సే, రానా దగ్గుబాటి, రవీంద్ర విజయ్ తదితరులు నటిస్తున్నారు. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నవంబర్ 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాకు డానీ సాంచేజ్ లోపేజ్ సినిమాటోగ్రఫీని, జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, జాను చాంతర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి లీవెలీన్ ఆంథోని, గోన్సాల్వేజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ కావడానికి ఈ సినిమా ఎంత వసూలు చేయాల్సి ఉంటుంది అనే వివరాల్లోకి వెళితే..

కాంత సినిమా కథ విషయానికి వస్తే.. తమిళ సినిమా పరిశ్రమలో 1950వ దశకంలో లెజెండరీ యాక్టర్ టీకే మహాదేవన్ త్యాగరాజన్ జీవితంలో జరిగిన కొన్నివేశాలే కాకుండా ఎంఆర్ రాధా, ఎంజీఆర్ లాంటి వ్యక్తుల జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో టాప్ యాక్టర్లందరూ, గొప్ప టెక్నిషియన్స్ పనిచేశారు. ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్, చిత్ర యూనిట్ రెమ్యునరేషన్, అలాగే ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 80 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
అయితే ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సురేష్, తమిళంలో ఏజీఎస్, మలయాళంలో స్వయంగా దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా బిజినెస్ మాత్రం కమిషన్ బేస్ట్‌లో జరుగుతున్నది. అలాగే తెలుగులో నిర్మాత రానానే స్వయంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా బిజినెస్ వివరాలు బయటకు రాలేదు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను 105 కోట్ల గ్రాస్ వసూళ్లుగా వాల్యూ కట్టారని తెలిసింది. ఈ సినిమా 105 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడితే లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
ఇక ప్రమోషనల్ కార్యక్రమాలు జోరందుకోవడంతో భారీ అంచనాల ఏర్పడటంతో కాంత సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 2500 నుంచి 3000 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు భారీగానే స్పందన లభించడంతో ప్రీమియర్లతో కలిపి తొలి రోజు బాక్సాఫీస్ వసూళ్లు రికార్డు స్థాయిలోనే ఉంటాయనే టాక్ వినిపిస్తున్నది.
తాజా అంచనాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 3 నుంచి 4 కోట్ల రూపాయలు, మలయాళంలో 3 కోట్ల రూపాయలు, తమిళం, కన్నడ, హిందీ ప్రాంతాల్లో కలిపి ఈ చిత్రం 12 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఇక నార్త్ అమెరికా, ఓవర్సీస్‌లో కలిపి ఈ చిత్రం 15 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది. తొలి ఆట తర్వాత మౌత్ టాక్ బాగా ఉంటే.. ఈ సినిమా కలెక్షన్ల రేంజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











