Kaantha Day 4 Collections: కాంత 4వ రోజు కలెక్షన్లు.. దుల్కర్ మూవీ నష్టాల్లో నుంచి బయటపడాలంటే?

దక్షిణాదిలో స్టార్ హీరోలు రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా స్పిరిట్ మీడియా, వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్లపై రూపొందుతున్న చిత్రం కాంత. తమిళ సినిమా పరిశ్రమంలో ఎంకే త్యాగరాజ భాగవతార్, ఎంజీఆర్, ఎంఆర్ రాధా లాంటి సినీ లెజెండ్స్ జీవితాలల్ో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన చిత్రం కాంత. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ భోర్సే, రానా దగ్గుబాటి, రవీంద్ర విజయ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాకు డానీ సాంచేజ్ లోపేజ్ సినిమాటోగ్రఫీని, జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, జాను చాంతర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి లీవెలీన్ ఆంథోని, గోన్సాల్వేజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నవంబర్ 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బిజినెస్ ఎంత? ఈ మూవీకి కలెక్షన్లు ఎంత? బ్రేక్ ఈవెన్ కావడానికి ఈ సినిమా ఎంత వసూలు చేయాల్సి ఉంటుంది అనే వివరాల్లోకి వెళితే..

Kaantha Movie Day 4 Box Office Collections

తమిళ సినిమా పరిశ్రమలో 1950వ దశకంలో లెజెండరీ యాక్టర్ టీకే మహాదేవన్ త్యాగరాజన్ జీవితంలో జరిగిన కొన్నివేశాలే కాకుండా ఎంఆర్ రాధా, ఎంజీఆర్ లాంటి వ్యక్తుల జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలను ఆధారంగా చేసుకొని కాంత సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో టాప్ యాక్టర్లందరూ, గొప్ప టెక్నిషియన్స్ పనిచేశారు. ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్, చిత్ర యూనిట్ రెమ్యునరేషన్, అలాగే ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 80 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఈ సినిమా బడ్జెట్ పరంగా చూసుకొంటే. నాన్ థియేట్రికల్ పరంగానే టేబుల ప్రాఫిట్ సాధించింది.

కాంత సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. టీజర్ నుంచి ట్రైలర్ వరకు.. ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్‌ను సుమారుగా 28 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. ఈ సినిమా 29 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బాక్సాఫీస్‌ జర్నీని మొదలుపెట్టింది.

తెలుగులో తొలి రోజు 1 కోటి రూపాయలు, రెండో రోజు 90 లక్షల రూపాయలు, మూడో రోజు 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 2.6 కోట్ల రూపాయలు నెట్, 4.7 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నైజాంలో 1.23 కోట్లు, సీడెడ్ 17 లక్షలు, ఆంధ్రా 1.2 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 9.5 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది.

గత మూడు రోజుల్లో కన్నడలో 1.5 కోట్ల రూపాయలు, తమిళంలో 6.6 కోట్ల రూపాయలు, కేరళలో 3.2 కోట్ల రూపాయలు, ఇతర ప్రాంతాల్లో 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో మూడు రోజుల్లో ఇండియా వైడ్ 16.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా నేషన్ వైడ్‌గా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 10 కోట్లకుపైగానే కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్‌లో 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా 4వ రోజు 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దాంతో 18 కోట్ల రూపాయల మేర వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X