Kaatera Box Office Report సలార్ మించి కాటేరా కలెక్షన్లు.. 50 కోట్ల టార్గెట్‌పై కన్నేసిన దర్శన్
కన్నడ సూపర్‌స్టార్ దర్శన్ హీరోగా నటించిన కాటేరా చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు సాధిస్తున్నది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాలో ఆరాధన రామ్ హీరోయిన్‌గా నటించగా, జగపతి బాబు, కుమార్ గోవింద్ తదితరులు నటించారు. తరుణ్ శ్రీధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాతగా వ్యవహరించారు. రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం తొలివారంతం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
Recommended Video

రైతులకు సంబంధించిన ఓ టిపికల్ సమస్యను ఆధారంగా చేసుకొని నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్
కాటేరా సినిమాను రూపొందించారు. ఈ సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్‌లో జరిగింది. అయితే ఈ సినిమాకు భారీ ఆదరణ ఉండటంతో కర్ణాటకతోపాటు ఇతర ప్రాంతాల్లో కలిపి 2000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

కాటేరా సినిమాకు తొలి రోజు భారీ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. మొదటి రోజు 11 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఇక రెండో రోజు 7.85 కోట్లు రూపాయలతో నిలకడగా వసూళ్లు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 18 కోట్ల రూపాయలు నికరంగా రాబట్టింది. ఇక మూడో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద ఘనంగా కలెక్షన్లు రాబట్టింది.
మూడో రోజు ఆదివారం కావడం అలాగే సంవత్సరపు చివరి రోజున కూడా కాటేరా సినిమాకు ఆడియెన్స్ సానుకూలంగా స్పందించారు. దాంతో ఈ మూవీ 9.5 కోట్లు నికర కలెక్షన్లు వసూలు చేసింది. గత మూడు రోజులుగా ఈ సినిమా 27 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇటీవల కాలంలో కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరింది.

ఇక కాటేరా సినిమాకు 4వ రోజున కూడా భారీ కలెక్షన్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా అటుఇటుగా 5 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 33 కోట్ల వద్ద నమోదు అయ్యే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా, కన్నడ బాక్సాఫీస్ వద్ద సలార్ సినిమాతో పోటీ పడుతూ కాటేరా కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ సినిమాతో దర్శన్ స్టార్ స్టామినా మరోసారి రుజువైంది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుంది. సలార్ సినిమాను మంచి కలెక్షన్లు సాధిస్తుందా? వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











