Kaatera Box Office Report కాటేరా 100 కోట్లకు చేరువగా..ప్రభాస్, షారుక్ రికార్డు బ్రేక్ చేసిన దర్శన్!

కన్నడ చిత్రం కాటేరా మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తూ 100 కోట్ల క్లబ్‌ వైపు దూసుకెళ్తున్నది. స్టార్ హీరో దర్శన్ నటించిన ఈ చిత్రం గత 5 రోజులుగా రికార్డు కలెక్షన్లను సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

దర్శన్ నటించిన కాటేరా చిత్రం రైతుల సమస్య ఆధారంగా తెరకెక్కింది. ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి కన్నడ ప్రేక్షకులు భారీగా ఆదరిస్తున్నారు. ఇక తొలి ఆట నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ ఏడాదిలో దర్శన్‌కు క్రాంతి మూవీ తర్వాత మరో ఘన విజయాన్ని అందించింది.

Kaatera 6 days Collections: Darshan surpasses Prabhas Salaar, Shah Rukh Khan Dunki Collections

కాటేరా చిత్రం 50 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను దాదాపు 2 వేల స్క్రీన్లలో రిలీజ్ చేశారు. 50 కోట్ల వ్యాల్యూతో ఈ సినిమా బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. అయితే ఈ సినిమా ట్రేడ్ వర్గాల అంచనాలు మంచి వసూళ్లను సాధిస్తున్నది.

కాటేరా మూవీ తొలి రోజున 11 కోట్ల నెట్ కలెక్షన్లతో బాక్సాఫీస్ జైత్రయాత్రను మొదలుపెట్టింది. రెండో రోజు 8 కోట్లు నికరంగా, మూడో రోజు 9.3 కోట్లు, నాలుగో రోజు ఈ సినిమా 9.25 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 37 కోట్ల నికర వసూళ్లను, 76 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఐదో రోజు కాటేరా చిత్రం భారీగా కలెక్షన్లు రాబట్టింది. కర్టాటకలో ఈ సినిమా 4.62 లక్షల టికెట్లను అమ్మినట్టు ట్రేడ్ వర్గాలు, చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దాంతో ఈ సినిమా 5వ రోజు కూడా సుమారుగా 10 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం 86 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

రాక్ లైన్ వెంకటేశ్ నిర్మించిన కాటేరా చిత్రం 6వ రోజు కూడా భారీగానే వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం 2.25 కోట్ల నికర వసూళ్లు, 5 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని తెలిపారు. దాంతో ఈ సినిమా 91 కోట్ల మేర నమోదు చేసే అవకాశం ఉంది అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా 100 కోట్ల రూపాయలు క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

Kaatera 6 days Collections: Darshan surpasses Prabhas Salaar, Shah Rukh Khan Dunki Collections

కర్ణాటకలో ఇటీవల రిలీజైన డంకీ, సలార్ సినిమాకు మించి కలెక్షన్లను సాధిస్తున్నది. షారుక్, ప్రభాస్ సినిమాల నుంచి ఎదురవుతున్న భారీ పోటిని ఎదుర్కొని బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను సాధిస్తున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X