Kaatera Closing Collections దర్శన్ కెరీర్‌లోనే రికార్డు కలెక్షన్లు..50 కోట్ల బడ్జెట్.. ఎన్ని వందల కోట్లంటే ?
కన్నడ సూపర్ స్టార్ దర్శన్ నటించిన తాజా చిత్రం కాటేరా మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను నమోదు చేసింది. డిసెంబర్ 29వ తేదీన కన్నడనాట రిలీజైన ఈ చిత్రం రికార్డు వసూళ్లను రాబట్టింది. రైతుల సమస్యను పాయింట్‌గా తీసుకొని రూపొందించిన ఈ మూవీకి కన్నడ ప్రేక్షకులను విశేషమైన ఆదరణను చూపించడంతో దర్శన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరింది. ఈ సినిమా బడ్జెట్, బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
కన్నడ బ్యూటీ ఆరాధన రామ్, తెలుగు సినియన్ హీరో జగపతి బాబు నటించిన కాటేరా మూవీ అన్ని ఖర్చులతో కలిపి 50 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌కు క్రేజీగా రెస్పాన్స్ రావడంతో భారీగానే బిజినెస్ జరిగింది. ఈ సినిమా 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దూకింది.

ఇక రిలీజ్‌కు కాటేరా చేసిన హడావిడితో బిజినెస్ హై రేంజ్‌లో జరగడంతో డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ల నుంచి భారీగా డిమాండ్ రావడంతో రికార్డు స్థాయిలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 2000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో టాక్ కూడా పాజిటివ్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది.
కాటేరా సినిమా తొలి రోజున ఘనంగా అంటే.. సుమారుగా 11 కోట్ల రూపాయల వసూళ్లతో బోణి కొట్టింది. తొలివారం ముగిసే సమయానికి యావరేజ్‌గా 7 కోట్ల రూపాయలతో కలెక్షన్ల పంట పండించింది. దాంతో ఈ సినిమా మొదటి వారం 46 కోట్ల నికర వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక కాటేరా సినిమా రెండోవారంలో కూడా అదే ఊపును కొనసాగించింది. సగటున ప్రతీ రోజు 2 కోట్లకు తక్కువ కాకుండా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా రెండోవారం 15 కోట్ల రూపాయల నికరంగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా రెండువారాల్లో 60 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది అని ట్రేడ్ పండితులు తెలిపారు.
కాటేరా మూడో వారంలో కూడా నిలకడగా వసూళ్లను రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. 15వ రోజున ఈ సినిమా 1 కోటి రూపాయలు నికరంగా, 16వ రోజున 60 లక్షలు నికరంగా, 17వ రోజున 1 కోటి రూపాయలు, 18వ రోజున 60 లక్షలు, 19వ రోజున 1 కోటి రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా కాటేరా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. మూవీ 20 రోజుల్లో 64 కోట్ల నికర కలెక్షన్లను కన్నడలో రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 72 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ మూవీ యూనిట్ తాజాగా 198 కోట్ల గ్రాస్ కలెక్షన్లను (జీఎస్టీ+హైర్స్) కలిపి వసూలు చేసిందని ప్రకటించింది.


Click it and Unblock the Notifications











