Kaatera Collections దర్శన్ మూవీ నాన్ పాన్ ఇండియా రికార్డ్.. కాటేరా సినిమాకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

కన్నడ సూపర్ స్టార్ దర్శన్, ఆరాధన రామ్ జంటగా, జగపతి‌బాబు, కుమార్ గోవింద్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం కాటేరా. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాతగా, తరుణ్ సుధీర్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్, ఎమోషనల్ మూవీ డిసెంబర్ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. వీ హరికృష్ణ సంగీతం, సుధాకర్ ఆర్ రాజ్ సినిమాటోగ్రఫిని అందించారు. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కాటేరా చిత్రానికి సంబంధించిన బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ప్రోమోషనల్ కాస్ట్, ఆర్టిస్టుల రెమ్యునరేషన్, ఇతర ఖర్చులతో కలిపి ఈ సినిమాను 50 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాకు క్రేజ్ భారీగా రావడంతో బిజినెస్ కూడా భారీగానే జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

Kaatera Day 1 Expected Collections Worldwide: Darshan Movie decent start at box office

కర్ణాటకలో కాటేరా మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. బెంగళూరుతోపాటు ప్రధాన నగరాల్లో మంచి స్పందన లభించింది. కేవలం బెంగళూరులోనే 2 కోట్లకుపైగా కలెక్షన్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వచ్చాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటకలో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ 5 కోట్లుగా నమోదు కావొచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

కాటేరా సినిమాకు మంచి బజ్ ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా రికార్డు థియేటర్లలో రిలీజ్ చేశారు. దర్శన్ కెరీర్‌లోనే అత్యధికంగా స్క్రీన్లలో ప్రదర్శించే ఏర్పాట్లు చేశారు. ఈ సినిమాను సుమారుగా 2000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 4 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయి. బెంగళూరులోనే 204 షోలు తొలి రోజు ప్రదర్శించారు.

కర్ణాటకలో కాటేరా సినిమాకు భారీ వసూళ్లు నమోదైనట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నాన్ పాన్ ఇండియా మూవీస్‌లో రికార్డును క్రియేట్ చేసింది. కర్ణాటకలోనే తొలి రోజు 3 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Kaatera Day 1 Expected Collections Worldwide: Darshan Movie decent start at box office
  • కాటేరా మూవీకి ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు నమోదయ్యాయి. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు, 9.5 కోట్ల షేర్ రూపాయలు రాబట్టింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అధిగమించాలంటే.. కనీసం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది.
  • కాటేరా సినిమా రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 6.75 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో ఇండియాలో 17.75 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
  • కాటేరా చిత్రం గత మూడు రోజులుగా నిలకడగా వసూళ్లు సాధిస్తున్నది. ఈ సినిమా కేవలం కర్ణాటకలోనే రిలీజ్ కావడం తెలిసిందే. ఈ సినిమా కన్నడలో మూడో రోజు 8.75 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం మూడు రోజుల్లో 28 కోట్ల రూపాయలు నికరంగా వసూలు చేసింది.
  • దర్శన్ నటించిన కాటేరా చిత్రం నాలుగో రోజున కన్నడ రాష్ట్రంలో స్టడీగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా 4వ రోజున 9.24 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 38 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
  • కాటేరా చిత్రం 5వ రోజు డ్రాప్ అయినప్పటికీ గౌరవ ప్రదమైన కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం మంగళవారం 4 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 41 కోట్ల షేర్, 70 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
  • దర్శన్ నటించిన కాటేరా చిత్రం 6వ రోజున కన్నడ బాక్సాఫీస్ వద్ద 2.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X