twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కబీర్ సింగ్ హాఫ్ సెంచరీ.. సినీ విమర్శకులకు చెంపపెట్టు.. మరోసారి జైకొట్టిన ప్రేక్షకులు

    |

    బాలీవుడ్ క్రిటిక్స్ అంచనాలను తలదన్నుతూ కబీర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. తెలుగులో ఘన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తున్నది. షాహీద్ కపూర్, కియారా అద్వానీ నటించిన ఈ చిత్రం గత రెండు రోజుల్లో రూ.50 కోట్ల వసూళ్లకు చేరువైంది. ఆదివారం హాలీడే రోజున కబీర్ సింగ్ మరింతగా కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. గత రెండు రోజుల్లో ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే..

     సినీ విమర్శకుల పెదవి విరుపు

    సినీ విమర్శకుల పెదవి విరుపు

    జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కబీర్ సింగ్ చిత్రంపై సినీ విమర్శకులు పెదవి విరిచారు. ముద్దులు ఏంటీ, డ్రగ్స్, మితీమీరిన శృంగారంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సినీ విమర్శకుల చెంపపెట్టుగా ప్రేక్షకులు కబీర్ సింగ్‌ను ఆదరించడం విశేషం. యూత్ ఆడియెన్స్‌ మెడికల్ స్టూడెంట్ ప్రేమకథకు మరోసారి జై కొట్టడంతో కబీర్ సింగ్ భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తున్నది. ఇప్పటికే ఈ సినిమా హాఫ్ సెంచరీకి చేరువైంది.

     అంచనాలను తలకిందులు చేస్తూ

    అంచనాలను తలకిందులు చేస్తూ

    కబీర్ సింగ్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తొలి రోజున భారీ ఓపెనింగ్స్ సాధించింది. షాహీద్ కపూర్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం తొలి రోజున రూ.20.21 కోట్లు వసూలు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. నాన్ హాలీడే రోజున ఓ భారీ సినిమాకు వచ్చినంతగా వసూళ్లు రావడం చర్చనీయాంశమైంది.

    హాఫ్ సెంచరీకి చేరువలో

    హాఫ్ సెంచరీకి చేరువలో

    ఇక రెండో రోజు కబీర్ సింగ్ చిత్రం రూ.22 కోట్లు రాబట్టింది. శనివారం సెలవు దినం కావడంతో యూత్ ఆడియెన్స్ పోటెత్తారు. దాంతో ఈ చిత్రం రూ.42.21 కోట్ల వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా సాధించింది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా 3123 స్క్రీన్లలో విడుదలైంది. షాహీద్ కపూర్ సినిమా ఈ రేంజ్‌లో రిలీజ్ కావడం కూడా ఓ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

     దర్శకుడు సందీప్ రెడ్డి రియాక్షన్

    దర్శకుడు సందీప్ రెడ్డి రియాక్షన్

    కబీర్ సింగ్ భారీ వసూళ్లను సాధించడంపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందించారు. కబీర్ సింగ్‌పై చూపిస్తున్న ఆదరణకు థ్యాంక్స్. నా సినిమాపై ప్రేక్షకుల ప్రేమకు సంతోషంలో మునిగిపోయాను అని సందీప్ పేర్కొన్నారు. ఇన్స్‌టాగ్రామ్‌లో కబీర్ సింగ్ గురించి దర్శకుడు సందీప్ రెడ్డి ఇలా స్పందించడం ఇదే మొదటిసారి.

    English summary
    Vijay Deverakonda's Arjun Reddy was a massive hit at the box office back in 2017, and its Hindi remake, Kabir Singh, is treading the same path. Reports suggest that Kabir Singh made Rs 22 crore on Saturday, thus taking the total collection to Rs 42.21 crore
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X