twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    100 కోట్లకు చేరువలో కబీర్ సింగ్... సంబరాల్లో షాహీద్, సందీప్, కియారా

    |

    అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మోత మోగిస్తున్నది. రిలీజ్ తర్వాత తొలి వారాంతంలో సుమారు రూ. 71 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్నది. ఇక తొలి వారాంతం తర్వాత సినీ పరిశ్రమకు అగ్ని పరీక్షగా నిలిచే సోమవారం రోజున కబీర్ సింగ్ తట్టుకొని భారీ కలెక్షన్లు సాధించింది.

    రిలీజ్ తర్వాత తొలి సోమవారం నాడు కబీర్ సింగ్ చిత్రం రూ.12 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.82.83 కోట్లు నమోదు చేసింది. షాహీద్ కపూర్ కెరీర్‌లో ఇది హయ్యెస్ట్ ఓపెనింగ్‌గా ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు.

    Kabir Singh 4 days collections: Inching towards 100 crores

    కబీర్ సింగ్ చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. సీనియర్ నటుడు డీనో మారియో ఈ కబీర్ సింగ్‌ను ప్రశంసిస్తూ టీట్ చేశారు. అద్భుతమైన సినిమా, షాహీద్ పెర్ఫార్మెన్స్‌ ఆహో అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

    కబీర్ సింగ్‌ను తొలి ఆట నుంచే నెగిటివ్ రివ్యూలు వెంటాడాయి. సినీ విమర్శకుల ప్రతికూల స్పందనను ఎదురించి వసూళ్ల పరంగా దూసుకుపోవడం గమనార్హం. ఈ చిత్రానికి మహారాష్ట్ర, చెన్నైలో మంచి స్పందన లభిస్తున్నది. ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు రావడంపై షాహీద్ కపూర్ గమ్మత్తుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. షాహిద్, కియారా, సందీప్ రెడ్డి వంగ ఉన్న ఆ ఫోటో ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారింది.

    English summary
    Vijay Deverakonda's Arjun Reddy was a massive hit at the box office back in 2017, and its Hindi remake, Kabir Singh, is treading the same path. Reports suggest that Kabir Singh mints Rs 70 crore over weekend. According to early estimates, it earned around Rs 12 crore, taking its total collection so far to Rs 82.83 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X