ఫస్ట్ వీక్ రిపోర్ట్: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘కబీర్ సింగ్’

తెలుగులో సూపర్ హిట్ అయిన 'అర్జున్ రెడ్డి' చిత్రం హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ అయి బాక్సాఫీసును షేక్ చేస్తోంది. తెలుగు వెర్షన్ డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా హిందీలోనూ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ రిలీజై విజయవంతంగా వారం రోజులు పూర్తయింది.

ఇప్పటికే 'కబీర్ సింగ్' మూవీ రూ.100 కోట్ల మార్కును క్రాస్ అవ్వగా... తొలివారం పూర్తయ్యే సమయానికి టోటల్ వసూళ్లు రూ. 134 కోట్లకు రీచ్ అయింది. ఈ ఏడాది విడుదలైన ఇండియన్ సినిమాల్లో ఇది హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన రెండో మూవీగా రికార్డులకెక్కింది. మరో వైపు షాహిద్ కపూర్ కెరీర్లోనూ ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.

‘Kabir Singh’ collected Rs 134 Cr in the first week

'అర్జున్ రెడ్డి' లాంటి కల్ట్ మూవీ సోల్... ఏ మాత్రం మిస్సవ్వకుండా బాలీవుడ్లో రీమేక్ చేయడంలో సందీప్ వంగా సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా విజయంతో సందీప్ రెడ్డికి బాలీవుడ్లో మంచి బ్రేక్ లభించినట్లయింది. అయితే ఈ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీకి తిరిగి వస్తాడా? బాలీవుడ్లోనే అవకాశాలు దక్కించుకుంటాడా? అనేది తెలియాల్సి ఉంది.

ఒరిజినల్ వెర్షన్లో విజయ్ దేవరకొండ చేసిన పాత్రను హిందీలో షాహిద్ కపూర్ పోషించాడు. అతడికి జోడీగా కియారా అద్వానీ నటించింది. ఈ మూవీ యువతను ఆకట్టువడంలో సక్సెస్ అయింది. త్వరలోనే ఈ చిత్రం రూ. 200 కోట్ల మార్కును అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరో వైపు తమిళంలో కూడా ఈ చిత్రం రీమేక్ అవుతోంది. చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి 'ఆదిత్య వర్మ' టైటిల్ ఫైనల్ చేశారు. సందీప్ వంగా దగ్గర అసిస్టెంటుగా పని చేసిన గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X