ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్: ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ దుమ్ము రేపింది!
Recommended Video
తెలుగులో సంచలన విజయం అందుకున్న కల్ట్ మూవీ 'అర్జున్ రెడ్డి'... హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో తెరకెక్కిన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ హీగా రూపొందించిన ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. కియారా అద్వానీ హీరోయిన్.
జూన్ 21న భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు షాహిద్ కపూర్ గత చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది. 2019లో సెకండ్ బెస్ట్ బాలీవుడ్ ఓపెనర్‌గా నిలిచింది.

3వేలకు పైగా స్క్రీన్లలో
‘కబీర్ సింగ్' చిత్రాన్ని ఇండియా వ్యప్తంగా 3123 స్క్రీన్లలో విడుదల చేశారు. మూవీ రిలీజ్ ముందు నుంచే భారీ అంచనాలు ఉండటంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. దర్శక నిర్మాతలు ఊహించినదానికంటే రెట్టింపు వసూలయ్యాయి. షాహిద్ కపూర్ గత చిత్రం పద్మావత్ రికార్డును సైతం ‘కబీర్ సింగ్' బద్దలు కొట్టడం గమనార్హం.

రూ. 21 కోట్ల నెట్
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘కబీర్ సింగ్' చిత్రం ఇండియా వ్యాప్తంగా తొలి రోజు రూ. 21 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇది షాహిద్ కపూర్ కెరీర్లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం. అతడి గత చిత్రం పద్మావత్(రూ. 18.28)ను అధిగమించింది. 2019లో సల్మాన్ ఖాన్ ‘భారత్' తర్వాత హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం ఇదే.

ఆ విషయంలో సందీప్ వంగా సక్సెస్ అయ్యాడు
‘అర్జున్ రెడ్డి' సినిమా విషయంలో సందీప్ రెడ్డి వంగా ఏదైతే చూపించాడో... ఆ సోల్ మిస్సవ్వకుండా హిందీలోనూ లవ్, పెయిన్, ఎమోషన్స్ పండించడంలో సక్సెస్ అయ్యాడు. కబీర్ సింగ్ పాత్రను దర్శకుడు అనుకున్న విధంగా రిప్రజంట్ చేసిన షాహిద్ కపూర్ మెప్పించాడు.

ఫస్ట్ వీకెండ్ రూ. 50 కోట్ల
సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ, టికెట్లకు ఉన్న డిమాండ్ చూస్తుంటే ‘కబీర్ సింగ్' చిత్రం ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేలోపు రూ. 50 కోట్ల మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. షాహిద్ కపూర్ కెరీర్లో మరో రూ. 100 కోట్ల చిత్రం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











