300 కోట్లు కొల్లగొట్టేసిన కబీర్ సింగ్.. బాక్సాఫీస్‌పై అదే దూకుడు..

Recommended Video

Kabir Singh Box Office Collection Day 24 ,Unstoppable In Its 4th Weekend || Filmibeat Telugu

పలు వివాదాలు, అనేక ప్రతికూలతల మధ్య కబీర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. నాలుగోవారంలోకి ప్రవేశించిన ఈ చిత్రం మిగితా చిత్రాలకంటే ధీటుగా ఏ మాత్రం తగ్గకుండా భారీ వసూళ్లను సాధిస్తున్నది. నాలుగో వారాంతానికి ఈ చిత్రం భారీ కలెక్షన్లను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం ట్రేడ్ వర్గాల అంచనాలను వెల్లడిస్తూ రికార్డు వసూళ్లతో హల్చల్ చేస్తున్నది. ఈ చిత్రం గత నాలుగు వారాంతాల్లో ఎంత వసూలు చేసిందంటే..

 గత 24 రోజుల్లో వసూళ్లు

గత 24 రోజుల్లో వసూళ్లు

గత 24 రోజుల్లో కబీర్ సింగ్ వసూళ్ల హవాకు హద్దే లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లను రాబట్టింది. నాలుగు వారాంతాల తర్వాత ఈ చిత్రం రూ.259.94 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం నాలుగో వారాంతంలో శుక్రవారం రూ.2.54 కోట్లు, శనివారం రూ.3.75 కోట్లు, ఆదివారం రూ.4.05 కోట్లు సాధించింది అని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.

 నాలుగు వారాంతాల్లో కలెక్షన్లు

నాలుగు వారాంతాల్లో కలెక్షన్లు

కబీర్ సింగ్ తొలివారంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. మొదటి వారంలో రూ.134.42 కోట్లు, రెండోవారంలో రూ.78.78 కోట్లు, మూడోవారంలో రూ.36.40 కోట్లు, నాలుగో వారాంతంలో రూ.10.34 కోట్లతో దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.259 కోట్లు రాబట్టింది అని తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ఇంకా ఉత్తరాది రాష్ట్రాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్నది.

 ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల క్లబ్‌లో

ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల క్లబ్‌లో

ఇక ప్రపంచవ్యాప్తంగా కబీర్ సింగ్ కలెక్షన్లను చూసుకుంటే సుమారు. 300 కోట్లకుపైగానే వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. యూఎస్ బాక్సాఫీస్ వద్ద రూ.12 కోట్లకుపైగానే వసూలు చేయగా.. ఇతర దేశాల్లో మొత్తంగా కలిపి రూ.34.62 కోట్ల వరకు కుమ్మేసినట్టు తెలుస్తున్నది. దీంతో ఇప్పటి వరకు 309.45 కోట్లు వసూలు చేసినట్టు తెలిసింది.

నాలుగో వారాంతం తర్వాత

నాలుగో వారాంతం తర్వాత

తెలుగులో విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా నటించిన అర్జున్ రెడ్డి ఎంతటి భారీ విజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రం ఆధారంగా కబీర్ సింగ్ దాదాపు రూ.60 కోట్లతో తెరకెక్కించారు. గడిచిన 24 రోజుల్లో రూ.309 కోట్లకుపైగా రాబట్టడంతో సినిమాను హిట్ జాబితాలోకి చేర్చారు. నాలుగో వారాంతం తర్వాత కబీర్ సింగ్ ఎలాంటి వసూళ్లను సాధిస్తుందనే చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X