కుమ్మేస్తున్న కబీర్ సింగ్ .. ఇండియా టాప్ టెన్ జాబితాలో అరుదైన రికార్డు
బాలీవుడ్ తారలు షాహీద్ కపూర్, కియారా అద్వానీ జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన కబీర్ సింగ్ చిత్రం భారీ విజయం వైపుగా దూసుకెళ్తున్నది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. 2019లో రిలీజైన చిత్రాలన్నింటిలో కబీర్ సింగ్ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఘనతను సాధించింది.
కబీర్ సింగ్ కలెక్షన్లను చూస్తే లాటరీ కొట్టేసినట్టు అనిపిస్తున్నది. ఆశ్చర్యకరమైన వసూళ్లను రాబడుతూ దూసుకెళ్లున్నది. సింబా వసూళ్లపై కన్నేసింది. ఈ చిత్రం శుక్రవారం రూ.5.40 కోట్లు, శనివారం రూ.7.51 కోట్లు, ఆదివారం రూ.9.61 కోట్లు, సోమవారం రూ.4.25 కోట్లతో రూ.239.97 కోట్లు వసూలు చేసింది అని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.

2019లో వికి కౌశల్ నటించిన యూరీ సినిమా ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన భారత్ చిత్రం రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ రెండు చిత్రాల వసూళ్లను మంగళవారం కబీర్ సింగ్ అధిగమించింది. మంగళవారం 3.20 కోట్లు వసూలు చేయడం ద్వారా ఇండియా వ్యాప్తంగా రూ.243.17 కోట్లు నమోదు చేసింది.
ఇప్పటి వరకు బాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో కబీర్ సింగ్ 10వ స్థానంలో నిలిచింది. బాహుబలి 1 టాప్‌లో ఉండగా, దంగల్, సంజూ, పీకే, టైగర్ జిందాహై, భజ్‌రంగీ భాయ్‌జాన్, పద్మావత్, సుల్తాన్, ధూమ్3, కబీర్ సింగ్ టాప్ 10 జాబితాలో నిలిచాయి.
తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం ఆధారంగా రూపొందిన కబీర్ సింగ్ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తూ ట్రేడ్ వర్గాలను ఆకట్టుకొంటున్నది.


Click it and Unblock the Notifications











